అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samsung Mobile Price Hike | దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ శాంసంగ్ (Samsung) తన వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం పలు ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై ధరలను పెంచిన సంస్థ.. తాజాగా మరికొన్ని మోడళ్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గెలాక్సీ ఏ, ఎఫ్ సిరీస్ మోడళ్లున్నాయి. పెరిగిన ధరలు ఏప్రిల్ 10 నుంచే అమలులోకి వచ్చాయి.
Samsung Mobile Price Hike | ఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందంటే..?
గెలాక్సీ ఏ06 స్మార్ట్‌ఫోన్ (Smart Phone) ధర వెయ్యి రూపాయలు పెరిగి బేస్ వేరియంట్ ధర రూ. 13,499లకు చేరింది. ఏ07 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,250 పెరగడంతో దీని ప్రారంభ ధర రూ. 10,999 అయ్యింది. గెలాక్సీ ఏ17 స్మార్ట్‌ఫోన్‌పై వేరియంట్‌ను బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 1,500 వరకు పెంచింది. దీంతో టాప్ వేరియంట్ ధర రూ.27,999కు చేరింది. శాంసంగ్ గెలాక్సీ ఏ36పై రూ.1,500 నుంచి రూ.3 వేలు, గెలాక్సీ ఏ56 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2వేల నుంచి రూ. 3,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Samsung Mobile Price Hike | ఇటీవల పలు మోడళ్లపై..
శాంసంగ్ ఇటీవల పలు మోడళ్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఆ ధరల పెంపు ఏప్రిల్ 8వ తేదీనుంచి అమలులోకి వచ్చింది. ఇందులో గెలాక్సీ ఎం36, గెలాక్సీ ఎఫ్ 36 స్మార్ట్‌ఫోన్లపై వెయ్యి రూపాయల చొప్పున, ఎం06, ఎఫ06 స్మార్ట్‌ఫోన్లపై రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెంచారు. అలాగే గెలాక్సీ ఎం07, గెలాక్సీ ఎఫ07 మోడళ్లపై రూ.1,900 వరకు పెంచింది.
ఇది కూడా చదవండి..: Indian Stock Market Surge | లాభాలతో ముగిసిన సూచీలు.. రూ. 6.85 లక్షల కోట్లు పెరిగిన సంపద
