అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Inter Results | తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాల తేదీపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 12వ తేదీన ఇంటర్మీడియట్ 1st, 2nd ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడిచింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు.
Telangana Inter Results | గత నెలాఖరులో వాల్యూయేషన్
ఇంటర్ సమాధాన పత్రాల వాల్యూయేషన్ గత నెలాఖరులోనే పూర్తయింది. అయితే అన్ని సబ్జెక్టులు పాసై.. కేవలం ఒక సబ్జెక్టులో ఒకటి రెండు మార్కులతో విద్యార్థులు ఫెయిల్ అయిన వారి సమాధానపత్రాలను ఈసారి మళ్లీ వాల్యూయేషన్ చేశారు. ఈ ప్రక్రియ సైతం ఇటీవలే ముగిసింది.
విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని ఫలితాలను ఈ నెల 12న విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంటర్ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈ యేడు 9,97,075 మంది ఇంటర్ పరీక్షలు రాశారు. వీరిలో 4,89,126 మంది ఫస్టియర్, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..
