అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్ లాంటి దేశం తన నాయకులకు నోబెల్ పురస్కారాలు కోరడం అత్యంత అసంబద్ధమైన, హాస్యాస్పదమైన విషయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆమె పోస్టు చేశారు.
Kavitha Nobel Comments | నోబెల్ పురస్కారం ఇవ్వాలనడం హాస్యాస్పదం
‘గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక పురస్కారం ఇవ్వాలని ఆ దేశ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు తమ దేశ నాయకులకు మూడు నోబెల్ బహుమతులు కావాలని అడుగుతున్నారని’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో హఫిజ్ సయీద్, మసూద్ అజర్ లాంటి ఉగ్రవాదులకు కూడా నోబెల్ పురస్కారాలు ఇవ్వాలని అడుగుతారేమోనని ఎద్దేవా చేశారు.
Kavitha Nobel Comments | వాళ్ల బుద్ధిని ప్రపంచానికి తెలియజేయాలి
పాకిస్తాన్ నోబెల్ శాంతి పురస్కారం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కవిత అన్నారు. ఈ పరిణామాలు నవ్వు తెప్పించేలా ఉన్నా.. భారతీయులం ఈ అంశాన్ని తేలికగా తీసుకోకూడదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద బుద్ధిని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టడం మన కర్తవ్యమన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మనం గళమెత్తాలన్నారు. ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కనీసం నోబెల్ పురస్కారం నామినేషన్‌కు కూడా అర్హత పొందకుండా చూడాలని వ్యాఖ్యానించారు.
Nobel for Hafiz Saeed and Masood Azhar next?
A terror state like Pakistan demanding a Nobel for its leaders is laughable. First, they wanted one for Trump; now they demand three for their own. In the future, they might as well demand one for terrorists like Hafiz Saeed and… pic.twitter.com/fN5h91Vsou
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 10, 2026
ఇది కూడా చదవండి..: Telangana Inter Results | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఏప్రిల్ 12న ఫలితాలు..
