అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: RSS Cheif Mohan Bhagwat | ఆర్ఎస్ఎస్ చీఫ్ (RSS chief visit) మోహన్ భగవత్ (Mohan Bhagwat) శనివారం జిల్లాకు రానున్నారు. రెంజల్ మండలం కందకుర్తిలో (Kandakurthi) ఆయన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
RSS Cheif Mohan Bhagwat | కందకుర్తిలో..
కందకుర్తిలో కొనసాగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభాస్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహశీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
