అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rotten meat storage | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాలాపూర్‌లోని సలామి ఇండస్ట్రీస్‌లో శుక్రవారం పోలీసులు, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు దాడులు చేశారు.
మదీనా కాలనీలోని సలామీ కోల్డ్ స్టోరేజ్ కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. కుళ్లిన మాంసం, మేక తలలు, కాళ్లు భారీ పరిమాణంలో వ్యర్థాలు అసురక్షిత పరిస్థితులలో నిల్వ ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. సంచుల్లో నింపిన టన్నుల కొద్ది మాంసాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Rotten meat storage | కేసు నమోదు
బాలాపూర్ కేంద్రంగా కుళ్లిన మాంసం దందా సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మొత్తం ఐదు కోల్డ్ స్టోరేజీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఒకదానిపై దాడి చేయగా.. భారీ మొత్తంలో కుళ్లిన మాంసం లభించడంతో అధికారులు ఫోకస్ పెంచారు. నిందితులపై కేసు నమోదు చేశారు. అన్ని గోదాంలపై దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Rotten meat storage | ఏం తింటున్నాం..
హైదరాబాద్‌లో ఇటీవల పోలీసులు దాడుల్లో భారీగా కల్తీ, నాసిరకం ఆహార పదార్థాలు లభ్యం అవుతున్నాయి. పాలు, నూనె, మద్యం ఇలా అన్నింటిని కల్తీ చేస్తున్నారు. మరోవైపు కుళ్లిన మాంసం, కుళ్లిన బిర్యానీలు విక్రయిస్తున్నారు. దీంతో నగర ప్రజలు ఇన్ని రోజులుగా తాము ఏం తింటున్నామని ఆందోళన చెందుతున్నారు. అసలు ఏది, కల్తీ ఏదో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కల్తీ చేసే వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.
Major #foodsafety violation busted in #Balapur
Joint raids by Balapur Police and @GHMCOnline officials at a #Salami #coldstorage facility in #MadinaColony exposed shocking #unhygienic conditions.#Rottenmeat, #goatheads, and large quantities of waste were found… pic.twitter.com/bGvgglYMLE
— NewsMeter (@NewsMeter_In) April 10, 2026
ఇది కూడా చదవండి : RTC Employees DA Hike | ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచిన ప్రభుత్వం
