అక్షరటుడే, ఆర్మూర్: Perkit Mahila Pranganam | పెర్కిట్(Perkit) మహిళా ప్రాంగణంలో(Mahila Pranganam) ఇటీవల చోటుచేసుకున్న సంఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Perkit Mahila Pranganam | కలెక్టర్‌కు నివేదిక..
మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ను కలిసి జరిగిన సంఘటన గురించి వివరించారు. మార్చిలో 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించామని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్‌గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫొటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని తెలిపారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్లు చేసి, వాట్సప్ చాటింగ్‌ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
Perkit Mahila Pranganam | బాధితులు ఫిర్యాదు చేయడంతో..
బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తీసుకురాగా.. పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ (Armoor Police) నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహిళా ప్రాంగణంలో శిక్షణ పొందిన యువతులను వేధించిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ తరహా ఘటనలు జిల్లాలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Jeevan Reddy joins BRS | 20న బీఆర్ఎస్లోకి జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు
