అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gudivada Amarnath Sentence | మాజీ మంత్రి Gudivada Amarnathకు జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నం అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ Varalakshmi తీర్పు నిచ్చారు. ఈ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధించారు.
Gudivada Amarnath Sentence | ఆత్మహత్యాయత్నంగా పరిగణిస్తూ…
2016 ఏప్రిల్ 17న జరిగిన సంఘటనకు సంబంధించినది ఈ కేసు. ఆ రోజు ప్రత్యేక రైల్వే జోన్ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గుడివాడ అమర్నాథ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నంగా పరిగణిస్తూ కేసు నమోదు చేశారు.
దీర్ఘకాలంగా వాదోపవాదాలు కొనసాగిన అనంతరం, ఈరోజు మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు వెల్లడించారు. కోర్టు నిర్ణయంతో గుడివాడ అమర్నాథ్‌కు జైలు శిక్ష విధించబడింది.
ఇదిలా ఉండగా, ఈ తీర్పుపై మాజీ మంత్రి స్పందిస్తూ పై కోర్టులో అప్పీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Satyashodhak School | గ్రామీణ ప్రాంతంలో విద్యా విప్లవం సత్యశోధక్ పాఠశాల.. 11న సిల్వర్ జూబ్లీ వేడుకలు!
