Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం

క్రైంనిజామాబాద్

Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం

ఆస్పత్రిలో కోలుకున్నా మృత్యువు ఆమెను వీడలేదు. ప్రైవేట్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తెల్లవారితే ఇంటికి చేరుకునే మధ్యలోనే అనంత లోకాలకు చేరుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:50 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Accident on NH44

అక్షరటుడే, కామారెడ్డి: Accident on NH44| ఆస్పత్రిలో కోలుకున్నా మృత్యువు ఆమెను వీడలేదు. ప్రైవేట్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తెల్లవారితే ఇంటికి చేరుకునే మధ్యలోనే అనంత లోకాలకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న అంబులెన్సును కాశీకి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో అంబులెన్స్ డ్రైవర్, పేషంట్ మృతి చెందిన ఘటన భిక్కనూరు రామేశ్వర్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..

Contents
  • Accident on NH44 | హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా…
    • Accident on NH44 |జీజీహెచ్ కు తరలింపు

Accident on NH44 | హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా…

ఆదిలాబాద్ కు చెందిన షైఫుల్లా ఖాన్ తన భార్య సలెహా భానును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఓ ప్రైవేట్ అంబులెన్సులో ఆదిలాబాద్ కు అర్ధరాత్రి సుమారు 12:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్ బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి జాతీయ రహదారి వద్దకు రాగానే వెనక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అంబులెన్సును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న పేషంట్ సలేహా భాను(60), డ్రైవర్ షేక్ సర్దార్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త షైఫుల్లా ఖాన్ కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.

Accident on NH44 |జీజీహెచ్ కు తరలింపు

విషయం తెలుసుకున్న భిక్కనూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పక్కకు తప్పించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని మృతదేహాలతో పాటు గాయపడిన వ్యక్తి ని జీజీహెచ్ కు తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్​!

Kamareddy Municipal Controversy | కామారెడ్డిలో మున్సిపల్​ అధికారులపై కౌన్సిలర్ల ఆగ్రహం..
Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
POCSO Case Verdict | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. పోక్సో కేసు నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు..
Sudarshan Reddy Polytechnic Initiative | పాలిటెక్నిక్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి
Class 10 exams | రెండో రోజు ప్రశాంతంగా పదోతరగతి పరీక్షలు
TAGGED:accident on nh44ambulance accident indiaambulance bus collisionbus crash telanganaindia highway crashkamareddy road accidentnh44 accident newstragic accident india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Elinati Shani Remedies Elinati Shani Remedies | ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారా.. ఈ పరిహారాలు చేస్తే కష్టాలన్నీ దూరం!
Next Article Aloe Vera Vastu Aloe Vera Vastu | కలబందను ఈ దిశలో ఉంచితే చాలు.. ఇంట్లో ధన వర్షం కురవాల్సిందే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?