అక్షరటుడే, వెబ్డెస్క్: Gold Price Today India | దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silver Prices స్థిరపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిణామాల కారణంగా హెచ్చుతగ్గులకు లోనైన విషయం తెలిసిందే. అయితే అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మార్కెట్లలో అనిశ్చితి తగ్గడంతో బంగారం ధరలు స్థిరపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు వారాంతానికి స్వల్ప తగ్గుదలతో ముగిసినప్పటికీ, వరుసగా మూడో వారం కూడా సుమారు 2 శాతం లాభాన్ని నిలబెట్టుకోవడం గమనార్హం. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి.
Gold Price Today India | ప్రధాన నగరాలలో ధరలు ఇలా..
నేడు ఉదయం దేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,660గా నమోదైంది. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1,54,100, 22 క్యారెట్లు రూ.1,41,260 కాగా, ముంబైలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,39,660గా నమోదయ్యాయి. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల ధర రూ.1,53,980, 22 క్యారెట్లు రూ.1,41,160గా ఉన్నాయి. కోల్‌కతాలో 24 క్యారెట్లు రూ.1,52,510, 22 క్యారెట్లు రూ.1,41,010, బెంగళూరులో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,39,660గా నమోదయ్యాయి. హైదరాబాద్లో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010గా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010, విశాఖపట్నంలో 24 క్యారెట్లు రూ.1,52,360, 22 క్యారెట్లు రూ.1,41,010గా ఉంది.
Gold Price Today India | వెండి ధర రూ.2,65,100
ఇక వెండి Silver విషయానికి వస్తే, దేశీయ మార్కెట్‌లో గ్రాము వెండి ధర రూ.265.10గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,65,100గా కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ప్రభావం తగ్గడంతో బంగారం ధరలు స్థిరపడ్డాయి. అయితే స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా నగరాల మధ్య ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తుంటాయి.
ఇది కూడా చదవండి..: Samsung Mobile Price Hike | యూజర్లకు షాకిచ్చిన శాంసంగ్.. భారీగా పెరిగిన మొబైల్ ధరలు
