Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు

ఆంధ్రప్రదేశ్​తాజా వార్తలు

Gudivada Amarnath Jail Sentence | గుడివాడ అమర్‌నాథ్‌కు జైలు శిక్ష.. ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు

2016లో విశాఖలో రైల్వే జోన్ కోసం చేసిన నిరాహార దీక్ష కేసులో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:02 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Gudivada Amarnath Jail Sentence

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gudivada Amarnath Jail Sentence | మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్‌  (Gudivada Amarnath) ఆత్మహత్యాయత్నం కేసులో జైలు శిక్ష పడింది. విశాఖపట్నంలో జరిగిన నిరాహార దీక్షకు సంబంధించి నమోదైన కేసులో రైల్వే కోర్టు (Railway Court) ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ మేరకు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు ఇచ్చారు.

Contents
  • Gudivada Amarnath Jail Sentence | అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్ష
    • Gudivada Amarnath Jail Sentence | రాజ‌కీయాల్లో హాట్ టాపిక్..

Gudivada Amarnath Jail Sentence | అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్ష

ఈ కేసు 2016 ఏప్రిల్ నెలకు చెందినది కాగా, అప్పట్లో విశాఖపట్నంలో రైల్వే జోన్ సాధన కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్‌నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష కొనసాగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే కేజీహెచ్‌కి తరలించారు. అయితే ఈ ఘటన అనంతరం టూ టౌన్ పోలీసులు అమర్‌నాథ్‌పై ఆత్మహత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఆరోపణలు రుజువయ్యాయని నిర్ధారించి శిక్ష విధించింది.

Gudivada Amarnath Jail Sentence | రాజ‌కీయాల్లో హాట్ టాపిక్..

కోర్టు తీర్పుపై స్పందించిన అమర్‌నాథ్, ఈ నిర్ణయాన్ని హైకోర్టు (Highcourt)లో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు. గుడివాడ అమర్‌నాథ్ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party)తో ప్రారంభించారు. 2006లో విశాఖపట్నంలో కార్పొరేటర్‌గా గెలిచి ప్రజా జీవనంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గ (Anakapalli Constituency) ఇంఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అమర్‌నాథ్, 2019లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. అయితే 2024 ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అమర్‌నాథ్ తండ్రి గుడివాడ గురునాథరావు ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. 1989లో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథరావు, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 1998లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలుపొందారు. మొత్తంగా, ఒక దశాబ్దం కిందట జరిగిన నిరాహార దీక్ష కేసులో ఇప్పుడు వచ్చిన ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి..: Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని

Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
Iran Israel War | సౌదీ అరేబియాపై ఇరాన్​ బాంబుల వర్షం.. ఇద్దరు దుర్మరణం.. మృతుల్లో ఒకరు భారతీయుడిగా గుర్తింపు!
Hyderabad Furniture Mall Fire | హైదరాబాద్‌లో అర్ధ‌రాత్రి భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ మాల్ దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
TAGGED:Anakapalli ConstituencyCongress PartyGudivada AmarnathGudivada Amarnath Jail SentenceHighcourtRailway Court
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article singer mangli Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 
Next Article Ameenpur Hydraa Demolitions Ameenpur Hydraa Demolitions | అమీన్​పూర్​లో హైడ్రా కూల్చివేతలు.. హైకోర్టు స్టే
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?