Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Yuzvendra Chahal Smoking | బ‌హిరంగ ప్ర‌దేశంలో సిగ‌రెట్ తాగిన చాహ‌ల్‌.. మందు మానేసాన‌ని చెప్పి, ఇలా సిగ‌రెట్ తాగ‌డ‌మేంటి?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - Yuzvendra Chahal Smoking | బ‌హిరంగ ప్ర‌దేశంలో సిగ‌రెట్ తాగిన చాహ‌ల్‌.. మందు మానేసాన‌ని చెప్పి, ఇలా సిగ‌రెట్ తాగ‌డ‌మేంటి?

క్రీడలు

Yuzvendra Chahal Smoking | బ‌హిరంగ ప్ర‌దేశంలో సిగ‌రెట్ తాగిన చాహ‌ల్‌.. మందు మానేసాన‌ని చెప్పి, ఇలా సిగ‌రెట్ తాగ‌డ‌మేంటి?

ఐపీఎల్ 2026 మధ్యలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వివాదానికి దారి తీసింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
9 గంటలు ago
Share
Yuzvendra Chahal Smoking

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yuzvendra Chahal Smoking | టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్, పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) చుట్టూ కొత్త వివాదం నెలకొంది. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో, ఆయన కారులో సిగరెట్ తాగుతున్నట్లు కనిపించే ఒక వీడియో సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది.

Contents
  • Yuzvendra Chahal Smoking | సిగరెట్ ముక్కను కిటికీ ద్వారా రోడ్డుపైకి విసిరేయడం
    • Yuzvendra Chahal Smoking | మ‌ద్య‌పానంకి దూరంగా ఉన్నాన‌ని చెప్పి..

Yuzvendra Chahal Smoking | సిగరెట్ ముక్కను కిటికీ ద్వారా రోడ్డుపైకి విసిరేయడం

వీడియోలో ఒక వ్యక్తి లగ్జరీ కారు (Luxury car) నడుపుతూ సిగరెట్ తాగి, ఆ సిగరెట్ ముక్కను కిటికీ ద్వారా రోడ్డుపైకి విసిరేయడం కనిపిస్తోంది. ఆ వ్యక్తి రూపం చాహల్‌ను పోలి ఉండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.సెలబ్రిటీగా ఉండి బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం సరైనదా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వీడియో నిజంగా చాహల్‌దేనా? లేక ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అన్నదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. పలు మీడియా సంస్థలు కూడా ఈ వీడియో నిజ‌మా, కాదా అనే దానిని ధృవీక‌రించ‌లేదు.

Yuzvendra Chahal Smoking | మ‌ద్య‌పానంకి దూరంగా ఉన్నాన‌ని చెప్పి..

ఇక ఇదిలా ఉండగా, ఇటీవలే చాహల్ తన ఫిట్‌నెస్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉన్నానని, ఫిట్‌నెస్ కోసం కట్టుబడి ఉన్నానని చాహల్ వెల్లడించాడు. 35 ఏళ్ల వయసులో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నానని తెలిపిన ఆయనపై ఇప్పుడు వచ్చిన ఈ వీడియో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ఈ సీజన్‌లో కీలక మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Hyderabad)తో మ్యాచ్ ముందు ఇలాంటి వివాదం జట్టుపై ఒత్తిడి పెంచే అవకాశముంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు చాహల్ 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు సాధించి సాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఈ వివాదంపై ఇప్పటివరకు చాహల్ గానీ, పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ గానీ స్పందించలేదు. వీడియో పాతదా, తాజాదా అన్నదానిపై కూడా స్పష్టత లేదు.ఇక సామాజిక బాధ్యత పరంగా కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు ఇలా బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ ముక్క వేయడం తప్పు అని పలు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకవేళ వీడియో నిజమని తేలితే చాహల్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైరల్ వీడియో  చుట్టూ ఉన్న అనుమానాలు, వివాదం మధ్య చాహల్ స్పందన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Mukul Chaudhary Innings | ఐపీఎల్‌లో కొత్త సంచలనం ముకుల్ చౌదరి.. అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోకు విజయం, అభినందించిన‌ సంజీవ్ గోయెంకా

Peddi Movie Postponed | ‘పెద్ది’ రిలీజ్‌పై గందరగోళం.. ఎస్‌కేఎన్ వ్యాఖ్యలపై క్లారిటీ, వాయిదా వార్తలకు చెక్
Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..
Footpath Encroachments | ఫుట్​పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం
Jio Hotstar: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుతో జియోహాట్‌స్టార్ గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డులు బద్దలు
Footpath Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై కొరఢా
TAGGED:HyderabadLuxury carPunjab KingsSocial MediaYuzvendra ChahalYuzvendra Chahal Smoking
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ameenpur Hydraa Demolitions Ameenpur Hydraa Demolitions | అమీన్​పూర్​లో హైడ్రా కూల్చివేతలు.. హైకోర్టు స్టే
Next Article Mangalhat Cordon Search Mangalhat Cordon Search | కార్డన్​ సెర్చ్​లో సిలిండర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?