అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లోని మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలి జిల్లా (Hingoli District)లోని కొన్ని ప్రాంతాలలో శనివారం ఉదయం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. నాందేడ్, పర్భణి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
భూకంపంతో పంగ్రా షిండే గ్రామం (Pangra Shinde Village)లోని కొన్ని ఇళ్లు, కమ్యూనిటీ హాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయని హింగోలి కలెక్టర్ రాహుల్ గుప్తా తెలిపారు. ఉదయం 8:45 గంటలకు నమోదైన ఈ భూకంప తీవ్రతను 4.7గా జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) లెక్కించిందని నాందేడ్ జిల్లా అధికారులు పేర్కొన్నారు. హింగోలి జిల్లాలోని వాస్మత్ తాలూకాలోని షిర్లీ గ్రామం (Shirley Village)లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
Maharashtra Earthquake | భయంతో పరుగులు
నాందేడ్ నగరం, గ్రామీణ ప్రాంతాలు, అర్ధాపూర్, హడ్గావ్, హిమాయత్‌నగర్ తాలూకాలు, పర్భణి జిల్లా (Parbhani District)లోని కొన్ని ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ప్రభావిత జిల్లాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, పలు నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని స్థానిక అధికారులు కోరారు. నాందేడ్, పర్భణిలలో అత్యవసర సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు.
ఇది కూడా చదవండి..: Yamuna Boat Accident | యమునా నదిలో మునిగిన పడవ.. పలువురు జలసమాధి..
