అక్షరటుడే, వెబ్డెస్క్ : Kodad Bus Accident | ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొంది. సూర్యాపేట జిల్లా (Suryapet District)లోని కోదాడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
హైదరాబాద్ (Hyderabad) నుండి ఏలూరుకు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఒక లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి (Kodad Government Hospital)కి తరలించారు. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు బస్సు, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Kodad Bus Accident | బస్సు దగ్ధం
మంటలు అంటుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travel Bus) దగ్ధం అయింది. ఈ ఘటన విశాఖ గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద శనివారం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో ట్రావెల్స్ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
ఇది కూడా చదవండి..: Rotten meat storage | కోల్డ్ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు
