అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hormuz Sea Mines | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని మూసివేసిన విషయం తెలిసిందే. సరుకు రవాణా నౌకలను అడ్డుకోవడానికి సముద్రంలో సీమైన్స్ అమర్చింది. అనుమతులు లేకుండా జలసంధి మీదుగా ప్రయాణించే నౌకలను పేల్చడానికి వాటిని ఏర్పాటు చేసింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల సీజ్ఫైర్ (Cease Fire) ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధి ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. హర్ముజ్ జలసంధిలో తాను అమర్చిన అన్ని నావికా మందుపాతరల ఆచూకీని ఇరాన్ మర్చిపోయిందని, దీంతో నౌకా రవాణా మార్గాన్ని తిరిగి తెరవలేకపోయిందని అమెరికా అధికారులు (America Officers) తెలిపారు. జలసంధిలోకి మరిన్ని నౌకలను అనుమతించాలన్న ట్రంప్ ప్రభుత్వ హెచ్చరికలను ఇరాన్ పాటించలేకపోవడానికి ఈ పరిణామం కూడా ఒక కారణమని సమాచారం.
Hormuz Sea Mines | అస్తవ్యస్తంగా..
ఇరాన్ జలసంధిలో అస్తవ్యస్తంగా మందుపాతరలు అమర్చిందని అమెరికా అధికారులు అంటున్నారు. ఆ దేశం మందుపాతరల అమరికను క్రమపద్ధతిలో పర్యవేక్షించలేదు, కొన్ని సందర్భాల్లో అవి తమ అసలు స్థానాల నుంచి కొట్టుకుఓయాయని పేర్కొన్నారు. నావికా మందుపాతరలను అమర్చడం కంటే వాటిని తొలగించడం చాలా కష్టం. అమెరికా సైన్యానికి పటిష్టమైన మైన్ తొలగింపు సామర్థ్యాలు లేవు. సాంకేతిక పరిమితులను తగిన విధంగా పరిగణనలోకి తీసుకుని జలసంధిని రాకపోకలకు తెరుస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అన్నారు.
Hormuz Sea Mines | వాటిని తొలగిస్తేనే…
ఇరాన్వద్ద 2000 నుండి 6000 వరకు సీ మైన్‌లు ఉన్నాయని అమెరికా అధికారులు అంచనా వేశారు. జలసంధిని తిరిగి తెరవడం అనే ప్రధాన అంశంపై ఈ మందుపాతరలు చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఇరాన్ జలసంధిలో కచ్చితంగా ఎన్ని మందుపాతరలు అమర్చింది, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయంపై అమెరికాకు ప్రస్తుతం స్పష్టత లేదు. వాటిని తొలగిస్తేనే ఆ మార్గంలో నౌకల రాకపోకలు యథావిధిగా సాగనున్నాయి.
ఇది కూడా చదవండి..: US Iran Talks Twist | అమెరికా-ఇరాన్ చర్చల్లో కొత్త ట్విస్ట్.. లెబనాన్‌పై తేల్చేవరకు చర్చలు లేవన్న టెహ్రాన్
