Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్

Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​

మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 1:39 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 గంటలు ago
Share
Jyotiba Phule Contribution

అక్షరటుడే, ఇందూరు: Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ గుప్తా అన్నారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్​లో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Contents
  • Jyotiba Phule Contribution | మొట్టమొదటి పాఠశాల..
    • Jyotiba Phule Contribution | మహిళలకు చట్టసభల్లో..

Jyotiba Phule Contribution | మొట్టమొదటి పాఠశాల..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల కోసం సతీమణి సావిత్రి భాయి పూలేతో కలిసి మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడు అని అన్నారు. ప్రధానంగా మహిళల విద్యకు ఆయన చేసిన సేవలు అపూర్వమైనవని పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని లక్ష్యంతో సత్యశోధకు సమాజాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ఒక మహానుభావుడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం అందరి బాధ్యత అన్నారు.

Jyotiba Phule Contribution | మహిళలకు చట్టసభల్లో..

ప్రధాని మోదీ (Prime Minister Modi) కూడా మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ లకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళిక రూపొందించకుండా మోసం చేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, కార్పొరేటర్లు కల్పె అర్చన చిరంజీవి, జ్యోతి మురళి, మల్లేష్ యాదవ్, బెల్లాల్ శశాంక్, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

AI Technology in Education | కాకతీయ ఇంజినీరింగ్​ కళాశాల విద్యార్థుల ఫేర్​వెల్​ పార్టీ
Armur Municipal Protest | ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట కార్మికుల ఆందోళన..
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Prajapalana Pragathi Pranalika | ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వామ్యులను చేయాలి
Electricity Workers Protest | ఒకే పనికి రెండు సర్వీస్ రూల్స్​ పెట్టడం బాధాకరం..: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల జేఏసీ
TAGGED:equality and educationIndian reformersJyotiba Phule Contributionliteracy movementMLA DhanpalPrime Minister ModiSavitribai PhuleSocial Reform Indiawomen education India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Modi Rahul Interaction Modi Rahul Interaction | పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం.. మోదీ – రాహుల్ గాంధీ మాటామంతి
Next Article Jyotiba Phule Jayanti Jyotiba Phule Jayanti | మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?