అక్షరటుడే, కామారెడ్డి: Jyotiba Phule Jayanti | మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను కొనసాగిద్దామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయం ముందు గల జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Jyotiba Phule Jayanti | మతతత్వ పార్టీలతో పోరాడుతున్నాం..
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వల్లే దేశంలో మతతత్వ పార్టీలతో పోరాడుతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమన్యాయం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. జ్యోతిబా పూలే (Jyotiba Phule) చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం కోసం ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 5 ఎకరాల చొప్పున కేటాయించడం జరుగుతుందని తెలిపారు. రూ.225 కోట్లతో పాఠశాలల నిర్మాణం కొనసాగుతోందన్నారు. వారం రోజుల్లో కామారెడ్డిలో (Kamareddy) ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు రాబోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, భిక్కనూరు, కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్లు లక్ష్మి, రాజు, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్పాల్
