Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Warning Officials | అధికారంలోకి వచ్చాక బుద్ధి చెబుతాం.. ఉద్యోగులకు కేటీఆర్​ వార్నింగ్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Warning Officials | అధికారంలోకి వచ్చాక బుద్ధి చెబుతాం.. ఉద్యోగులకు కేటీఆర్​ వార్నింగ్​

తెలంగాణ

KTR Warning Officials | అధికారంలోకి వచ్చాక బుద్ధి చెబుతాం.. ఉద్యోగులకు కేటీఆర్​ వార్నింగ్​

బీఆర్​ఎస్​ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులకు కేటీఆర్​ వార్నింగ్​ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి బుద్ధి చెబుతామన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 3:12 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
KTR Warning Officials

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Warning Officials | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)​ సీఎం రేవంత్​రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 నెలల్లో రేవంత్ సాధించింది ఏమీ లేదన్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం తప్ప ఏం చేశారని ఎద్దేవా చేశారు.

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతో పాటు.. సెగ్మెంట్‌లోని గ్రామాల్లో ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, సర్పంచ్‌లను కేటీఆర్​ శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న అధికారులకు వార్నింగ్​ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వారికి బుద్ధి చెబుతామన్నారు. ఇబ్రహీంపట్నంలో గెలిచింది గులాబీ జెండా కాదు, ప్రజాస్వామ్యం అని కేటీఆర్​ అన్నారు. దాన్ని నిలిపింది మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని కొనియాడారు. కాగా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపాలిటీని బీఆర్​ఎస్​ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మెజారిటీ రాకున్నా.. అత్యధిక స్థానాల్లో గెలుపొందిన బీఆర్​ఎస్​ బీజేపీతో కలిసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

KTR Warning Officials | ఫ్యూచర్​ లేని సీఎం

బీఆర్​ఎస్​ హయాంలో 7 ఏళ్లు కష్టపడి ఫార్మా సిటీ ఏర్పాటు చేశామని కేటీఆర్​ తెలిపారు. ఆ భూముల్లో ఇప్పుడు రేవంత్​రెడ్డి ఫ్యూచర్​ సిటీ కడతానని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ (Hyderabad)లో ప్రజలు దోమలతో ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని సీఎం.. ఫ్యూచర్​ సిటీ కడతారంట అని ఎద్దేవా చేశారు. 3 వేల ఎకరాల భూమిని రిలయన్స్‌కు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సీఎంకు ఫ్యూచర్​ లేదన్నారు. కాంగ్రెస్​ పార్టీ 50 ఏళ్ల వరకు అధికారంలోకి రాకుండా రేవంత్​రెడ్డి చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారంలో నుంచి దిగి పోయాక ఆయనను చూసి కూర్చున్న కుక్క కూడా లేవదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన దుర్మార్గాలకు ప్రజలు సరైన సమాధానం చెబుతారన్నారు.

ఇది కూడా చదవండి : Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు

Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు
Rajagopal Reddy criticism | ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి విమర్శలు
Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
Kondagattu temple accident | కొండగట్టులో అపశృతి.. 15 మంది భక్తులకు గాయాలు
TAGGED:BRSFuture City HyderabadGovernment officials warningKTRMunicipal ElectionsRevanth ReddyTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article CITU Noorjahan | CITU Noorjahan | సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ కన్నుమూత
Next Article Kamareddy Indoor Stadium | Kamareddy Indoor Stadium | ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం: షబ్బీర్​అలీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?