Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Paddy Procurement Centers | కోతలు జోరందుకున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Paddy Procurement Centers | కోతలు జోరందుకున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

నిజామాబాద్

Paddy Procurement Centers | కోతలు జోరందుకున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలో వరికోతలు జోరందుకున్నాయి. కొన్నిప్రాంతాల్లో చివరి దశకు చేరాయి. దీంతో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 5:35 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
8 గంటలు ago
Share
Paddy Procurement Centers

అక్షరటుడే, ఆర్మూర్​/కోటగిరి: Paddy Procurement Centers | జిల్లాలో వరికోతలు జోరందుకున్నాయి. కొన్నిప్రాంతాల్లో చివరి దశకు చేరుకున్నాయి. అలాగే అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు సైతం వెంటనే కొనుగోలు కేంద్రాలు (Procurement Centers) ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు కొన్ని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Contents
  • Paddy Procurement Centers | నందిపేట్​ మండలం వెల్మల్‌లో..
    • Paddy Procurement Centers | పోతంగల్​ మండలం కొల్లూరులో..
      • బాల్కొండ మండలంలోని కిసాన్​నగర్​లో..

Paddy Procurement Centers | నందిపేట్​ మండలం వెల్మల్‌లో..

నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో (Velmal Village) శనివారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐలాపూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గుజ్జి దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్ మాట్లాడుతూ రైతులు తమ పంటను తప్పనిసరిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎఫ్‌సీఐ కొనుగోలు కేంద్రంలోనే అమ్ముకోవాలని సూచించారు. బయట దళారులకు తక్కువ ధరలకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని స్పెషల్ ఆఫీసర్ బాబురావు, సొసైటీ సెక్రెటరీ నరహరికి సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు వంటి మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మహేష్, మాజీ వైస్ ఛైర్మన్ చిన్నరెడ్డి, మాజీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Paddy Procurement Centers

Paddy Procurement Centers | పోతంగల్​ మండలం కొల్లూరులో..

అక్షరటుడే,కోటగిరి : పోతంగల్ మండలం (Pothangal Mandal) కొల్లూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రాన్ని , ఏఎంసీ ఛైర్మన్ గైక్వాడ్​ హన్మంత్, సర్పంచ్ లోని జగన్ ఐకేపీ ఏపీఎం భాస్కర్, రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం అమ్ముకొని గిట్టుబాటు ధర పొందాలన్నారు. దళారులకు అమ్మితే తూకంలో మోసం, ధరల్లో వ్యత్యాసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని సూచించారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు నిమ్మల శారద, ఆర్ఐ సయ్యద్ హుస్సేన్, ఉప సర్పంచ్ రవి, ఏఈవో శంకర్, సీసీ నాగలక్ష్మి రైతులు, సంపత్ మారుతి, దిగంబర్, నాగేష్, హనుమంత్, రమేష్, ప్రశాంత్, హౌగిరావు, గంగారం, సత్యం తదితరులు పాల్గొన్నారు.

బాల్కొండ మండలంలోని కిసాన్​నగర్​లో..

బాల్కొండ మండలంలోని కిసాన్​నగర్​ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేల్పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొత్తఇంటి ముత్యం రెడ్డి, వైస్ ఛైర్మన్ గడ్డం నర్సారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ధరలు అందేలా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడుతుందని, రైతుల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు.

danyam

ఇది కూడా చదవండి..: BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి

PRTU Ravinder Sharma | విషాదం.. బ్రెయిన్​ స్ట్రోక్​తో పీఆర్టీయూ నేత మృతి
Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
Hanuman Shobha Yatra Security | హనుమాన్ శోభాయాత్రకు పటిష్టమైన బందోబస్తు: సీపీ సాయిచైతన్య
TAGGED:crop harvest newsfarmer support schemesgrain purchase centersPaddy Procurement CentersPothangal MandalProcurement Centersrural developmentVelmal Village
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Indoor Stadium | Kamareddy Indoor Stadium | ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేలా ఇండోర్ స్టేడియం నిర్మాణం: షబ్బీర్​అలీ
Next Article Ilapur Land Scam Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?