Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు

ఐలాపూర్​లో ఆక్రమణల తొలగింపుపై హైడ్రా కమిషనర్​ స్పందించారు. ముఖీమ్​ తన అనుచరులతో వందల ఎకరాల భూములు కబ్జా చేశారన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 4:07 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
6 గంటలు ago
Share
Ilapur Land Scam

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ilapur Land Scam | సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్​పూర్​ మండలం ఐలాపూర్​లో హైడ్రా శనివారం ఉదయం భారీ ఆపరేషన్​ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన కట్టడాలను తొలగించింది. వేలాది మంది అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య న్యాయవాది ముఖీమ్ ఫామ్ హౌజ్​, అతడి సోదరుడు అజీమ్​ నిర్మించిన ఆరంతస్తుల బిల్డింగ్​ను నేలమట్టం చేసింది.

Contents
  • Ilapur Land Scam | రెండు దశాబ్దాలుగా..
    • Ilapur Land Scam | కూల్చివేతలపై స్టే ఇవ్వలేదు
      • Ilapur Land Scam | స్థానికుల హర్షం

హైకోర్టు (High Court) స్టే ఉన్నప్పటికీ, ముఖీమ్ (తన భూ మాఫియా ముఠా ద్వారా) వేలాది ప్లాట్లను ఆక్రమించి, విక్రయించి వందల కోట్ల రూపాయలు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఐలాపూర్ భూములపై 1998లో హైకోర్టు స్టే విధించింది. అయినా కూడా ముఖీమ్, అతని భూ మాఫియా మొదట ఫామ్​ హౌజ్​ నిర్మించారు. అనంతరం సమీప స్థలాలను ఆక్రమించారు. ముఖీమ్ ఇప్పటివరకు నోటరీల వద్ద వేలాది ప్లాట్లను విక్రయించి వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. అతని ముఠా అక్రమంగా ఏర్పాటు చేసిన వాణిజ్య దుకాణాల నుంచి ప్రతి నెలా కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

Ilapur Land Scam | రెండు దశాబ్దాలుగా..

ముఖీమ్​ తన అనుచరులతో 2 దశాబ్దాలకు పైగా స్థానికంగా మాఫియా రాజ్యాన్ని నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా ఇన్ని రోజులు అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆ భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. హైకోర్టు స్టే ఉన్నా.. ముకీమ్ 2006లో ఒక ఫామ్‌హౌస్‌ను నిర్మించాడు. గత సంవత్సరం ఆ ఫామ్‌హౌస్‌ను 40 ఎకరాలకు విస్తరించాడు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకున్నారు. పలువురు అధికారులు సైతం ఆయనకు అనుకూలంగా పని చేసినట్లు సమాచారం.

Ilapur Land Scam | కూల్చివేతలపై స్టే ఇవ్వలేదు

ఐలాపూర్​లో కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హైడ్రా కూల్చివేతలు నిలిపివేసిందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ (Hydraa Commissioner Ranganath) ఖండించారు. హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదన్నారు. ముఖీమ్​ తన ఫామ్​హౌజ్​ కేంద్రంగా ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. 20 ఏళ్లుగా ముఖీమ్‌ తన అనుచరులతో కలిసి భూదందా చేస్తున్నట్లు తెలిపారు. 100 గజాలకు రూ.10 లక్షల చొప్పున పేదలకు విక్రయించాడన్నారు.

Ilapur Land Scam | స్థానికుల హర్షం

ఐలాపూర్​లో కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాపాడిన హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫొటోకు పాలాభిషేకం చేశారు. కాగా గ్రామంలో మొత్తం 1,263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో ఇప్పటికే కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అధికారులు వాటి జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమినే కాపాడారు.

ఇది కూడా చదవండి..: Mohammed Abdul Malik | నాటి అక్షరాల ఆరాటం.. నేటి ఆచార్య కిరీటం.. ఆదర్శం ఫ్రొఫెసర్​ మాలిక్ జీవన ప్రయాణం!

Housing Board registrations | ‘హౌసింగ్​ బోర్డు’ రిజిస్ట్రేషన్లు క్లియర్​ చేస్తాం : మంత్రి పొంగులేటి
Ali Khamenei Death | ఖమేనీ మరణం.. ఇరాన్​లో 40 రోజులు సంతాప దినాలు.. వారం రోజులు సెలవులు!
Hyderabad Rain Traffic | ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్​… హైదరాబాద్​లో వాహనదారుల ఇక్కట్లు!
air conditioner effects | ఏసీలో ఉంటున్నారా.. అయితే ఈ ముప్పు గురించి తెలుసుకోవాల్సిందే!
Probiotics for Women | మహిళల ఆరోగ్యానికి ‘ప్రొబయోటిక్స్’.. ఇవి చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
TAGGED:CM Revanth Reddygovernment actionHigh CourtHydraaHydraa Commissioner RanganathIlapur Land Scamillegal constructionLand EncroachmentMukheem caseproperty disputeSangareddy DistrictTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Paddy Procurement Centers Paddy Procurement Centers | కోతలు జోరందుకున్న వేళ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు..
Next Article Youth Drug Awareness Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?