అక్షరటుడే, వెబ్డెస్క్: Seethakka Warning | ములుగు జిల్లా (Mulugu District) పర్యటనలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
మంత్రి సీతక్క (Minister Seethakka) శనివారం ములుగులో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మేడారం ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. మేడారంలో ఇటీవల స్తంభం కూలి ఓ బాలుడి కాలు విరిగింది. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపంతోనే ఈ ఘటన జరిగిందని పలు పార్టీల నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె స్పందించారు.
Seethakka Warning | ఊరుకునేది లేదు
నిరాధార ఆరోపణలతో మనోభావాలను కించపరిస్తే ఊరుకునేది లేదని సీతక్క హెచ్చరించారు. అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్లు కొనుగోలులో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నిలబడుతోంన్నారు. రూ.11,650కు ఒక్కో మొబైల్ కొనుగోలు చేస్తే.. రూ.14 వేలకు కొన్నామని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేడారం అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద ఎలాంటి కమీషన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి..: Ilapur Land Scam | ఐలాపూర్లో ముఖీమ్ భూ దందా.. హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
