Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. ర‌క్తంతో త‌డిసిన స్కూల్ బ్యాగులు, బూట్ల‌తో పాకిస్తాన్‌కి..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. ర‌క్తంతో త‌డిసిన స్కూల్ బ్యాగులు, బూట్ల‌తో పాకిస్తాన్‌కి..!

అంతర్జాతీయం

Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. ర‌క్తంతో త‌డిసిన స్కూల్ బ్యాగులు, బూట్ల‌తో పాకిస్తాన్‌కి..!

యుద్ధ భీకరతను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మినాబ్ పాఠశాల చిన్నారుల జ్ఞాపకాలను వెంట తీసుకుని ఇరాన్ ప్రతినిధి బృందం పాకిస్థాన్ చేరుకుంది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 4:31 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Iran Peace Talks

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran Peace Talks | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, అమెరికా (America) తో శాంతి చర్చల కోసం ఇరాన్ చేపట్టిన తాజా ప్రయత్నం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చర్చల కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు బయలుదేరిన ఇరాన్ ప్రతినిధి బృందం, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకాలను తమ వెంట తీసుకెళ్లడం విశేషం.

Contents
  • Iran Peace Talks | ‘మినాబ్ 168’గా ప్రతినిధి బృందానికి పేరు
    •  Iran Peace Talks | పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం విమానంలో రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, చిన్నారుల బూట్లు, తెల్ల గులాబీలు, అలాగే మినాబ్ స్కూల్ బాధితుల ఫోటోలను ముందువరుసలో ఏర్పాటు చేసింది. ఈ దృశ్యాలు యుద్ధం వల్ల కలిగిన మానవ నష్టాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయి.

Iran Peace Talks | ‘మినాబ్ 168’గా ప్రతినిధి బృందానికి పేరు

ఘాలిబాఫ్ ఈ ఫోటోను సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేస్తూ.. నా విమానంలో 168 మంది మినాబ్ సహచరులు ఉన్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యేలా వ్యాఖ్యానించారు. ఈ చర్య ద్వారా యుద్ధం కేవలం రాజకీయ సంఘర్షణ కాదని, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న మానవ విషాదమని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మినాబ్ ప్రాంతంలోని పాఠశాలపై జరిగిన భీకర దాడిలో 168 మంది చిన్నారులు  ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారుల జ్ఞాపకార్థం ప్రతినిధి బృందానికి “మినాబ్ 168” అనే పేరు పెట్టారు.దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందిస్తూ “మినాబ్ పిల్లలను మేమెప్పటికీ మర్చిపోము” అని పేర్కొంది.

 Iran Peace Talks | పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి

‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)పేరుతో జరిగిన దాడుల్లో మినాబ్‌లోని షజరే తాయెబే బాలికల ప్రాథమిక పాఠశాల లక్ష్యంగా మారింది. పాఠశాల నడుస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి చెందడం ప్రపంచాన్ని కలిచివేసింది. పౌర ప్రాంతాలు, ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాలకు వ్యతిరేకమని నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, ఇది “క్రూరమైన హత్య” అని పేర్కొన్నారు. చిన్నారుల సామూహిక సమాధుల ఫోటోలను పంచుకుంటూ, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ శాంతి చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేదా అన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. యుద్ధం వల్ల నష్టపోయిన అమాయకుల ప్రాణాలను గుర్తుచేస్తూ ఇరాన్ తీసుకున్న ఈ ప్రతీకాత్మక చర్య ప్రపంచాన్ని కదిలిస్తోంది.

ఇది కూడా చదవండి..: Iran US Ceasefire | ఇరాన్‌ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా

Small LPG Cylinder Demand | చిన్న సిలిండర్‌కు పెద్ద డిమాండ్.. రెండు వారాల్లో 6.6 లక్షల అమ్మకాలు
Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్
Ramadan Iran Israel Conflict | పవిత్ర రంజాన్​ మాసంలో అట్టుడుకుతున్న ఇస్లామిక్​ దేశాలు
Saudi Exit Warning | వెంటనే సౌదీని వీడండి.. పౌరులకు అమెరికా విజ్ఞప్తి
Israel Iran Attack | ఇజ్రాయెల్ మరో దాడి.. 85 మంది బాలికలు మరణించారని ఇరాన్‌ ఆరోపణ
TAGGED:Americaglobal politics newshumanitarian crisisIran Peace TalksIran US relationsIslamabad newsMiddle East conflictMinab victimsOperation Epic FurySocial Mediawar impact children
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Seethakka Warning Seethakka Warning | తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తా.. మంత్రి సీతక్క వార్నింగ్​
Next Article Drunk Driving Cases Drunk Driving Cases | రెండు వారాల్లో 338 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు..: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?