అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో గడిచిన రెండు వారాల్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు 338 నమోదు నమోదయ్యాయని, రూ.25 లక్షలకు పైగా జరిమానాలు విధించబడ్డాయని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya)పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Drunk Driving Cases | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, అన్ని పీఎస్‌లలో గడిచిన రెండు వారాల్లో డ్రంకన్ డ్రైవ్ (Drunken Driving) తనిఖీలు నిర్వహించినట్లు సీపీ తెలిపారు. ఈ సందర్భంగా 338 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్ ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చినట్లు వివరించారు. ఇందులో 34 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి ఆయా కోర్టులు రూ.25,75,000 జరిమానా విధించినట్లు తెలిపారు. మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలపై తిరగవద్దని సీపీ సూచించారు.
ఇది కూడా చదవండి..: Youth Drug Awareness | యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి: సీపీ సాయిచైతన్య
