Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే

తెలంగాణతాజా వార్తలు

Monsoon Rainfall Deficit | రైతులకు అలెర్ట్​.. ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రమే

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తాయని అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 6:27 సా.
Srinivas Kolluri
6 గంటలు ago
Share
Monsoon Rainfall Deficit

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Monsoon Rainfall Deficit | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు తన ఉగ్రరూపం చూపుతున్నాడు. దీంతో ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే ప్రజలు జంకుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాకాలంలో లోటు వర్షపాతం (Rainfalll) నమోదు అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Contents
  • Monsoon Rainfall Deficit | ఆ జిల్లాలపై ప్రభావం
    • Monsoon Rainfall Deficit | పంటల సాగుపై..
      • జిల్లాల వారీగా..

రాష్ట్రవ్యాప్తంగా 2025లో అధిక వర్షపాతం నమోదు అయింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. అయితే 2026లో పరిస్థితులు భిన్నంగా ఉండనున్నాయి. బలమైన ‘ఎల్-నినో’ ప్రభావంతో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వర్షాకాలం 2018 నాటి పరిస్థితులను పోలి ఉంటుందని అధికారులు తెలిపారు.

Monsoon Rainfall Deficit | ఆ జిల్లాలపై ప్రభావం

సాధారణంగా రాష్ట్రంలో జూన్​లో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో తెలంగాణ (Telangana)లో వర్షాలు మొదలు అవుతాయి. గతేడాది మేలోనే రుతుపవనాలు వచ్చాయి. ఈ ఏడాది రుతుపవన కాలంలోని అన్ని నెలల్లోనూ (జూన్ – సెప్టెంబర్) వర్షపాతం సాధారణ స్థాయికి దిగువన, ఓ మోస్తరుగా మాత్రమే ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు 2014-15 నాటి పరిస్థితుల వలె అత్యంత దారుణంగా ఉండవు. అయినప్పటికీ, గత 5-6 ఏళ్లతో పోలిస్తే, ఈ సంవత్సరం రుతుపవన వర్షాలు తక్కువగానే ఉంటాయని తెలిపారు. లోటు వర్షపాతం కారణంగా దక్షిణ తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Monsoon Rainfall Deficit | పంటల సాగుపై..

రాష్ట్రంలో వరి పంట (Paddy) ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. దీనికి నీరు అధికంగా అవసరం ఉంటుంది. అయితే రానున్న వర్షాకాలం (Rain season)లో నీటిని పొదుపుగా వాడుకోవాలని, తదనుగుణంగా పంటల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు చెబుతున్నారు. వర్షాలు లేకపోతే వరి పైర్లు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారు.

జిల్లాల వారీగా..

ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, మెదక్​, సిద్దిపేట, కరీంనగర్​, భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, వరంగల్​, మహబూబాబాద్​, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం కురుస్తుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Ilapur Land Scam | ఐలాపూర్​లో ముఖీమ్​ భూ దందా.. హైడ్రా కమిషనర్​ కీలక వ్యాఖ్యలు

Stock Market Rally | కోలుకున్న మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Excise Officer Resignation | ఎక్సైజ్​ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..
Kamareddy Sisters Murder | మహిళా దినోత్సవాన్ని.. ప్రశ్నిస్తున్న పసి హృదయాలు!
sun damage skin | ఎండ వల్ల చర్మం నల్లగా మారుతోందా.. ఇలా చేస్తే రక్షణ గ్యారంటీ!
TAGGED:agriculture impactcrop loss riskel nino 2026farmers warninglow rainfall indiamonsoon deficitwater managementweather forecast
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bomb Threat Bomb Threat | రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు..
Next Article Jyoti rao Phule | Jyoti rao Phule | మహాత్మా జ్యోతిరావు పూలేకు భారతరత్న ఇవ్వాలి: ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?