అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Results 2026 | ఇంటర్ విద్యార్థుల (Inter Students) ఉత్కంఠకు తెరపడనుంది. వార్షీక పరీక్షలు రాసిన విద్యార్థులు చాలా రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించింది.
ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి, తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వైస్ ఛైర్‌పర్సన్ యోగితా రాణా ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.
Inter Results 2026 | ఇక్కడ చూసుకోవచ్చు
విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు. https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో చూసుకోవచ్చు. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 4,89,126 మంది ఫస్టియర్, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఇది కూడా చదవండి : Seethakka Warning | తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తా.. మంత్రి సీతక్క వార్నింగ్
