అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Plaza Accident | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా (Keesara Toll Plaza) దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బీఎండబ్ల్యూ కారు (BMW Car)పై భారీ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. అందులో ఉన్న వారికి తీవ్రగాయాలు అయ్యాయి.
కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం అతివేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న కారుపై బోల్తా పడింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్ టోల్‌ప్లాజాను దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడినట్లు తెలిసింది. అయితే ఆ సమయంలో అక్కడ కారు ఉండటంతో పూర్తిగా ధ్వంసం అయింది.
Toll Plaza Accident | న్యాయవాది మృతి
ఈ ప్రమాదంలో అడ్వకేట్ పీ శ్రీనివాస రావు మృతి చెందారు. రెండు గంటలకు పైగా శ్రమించి ట్యాంకర్ కింద నుంచి కారుని పోలీసులు తీశారు. కారు నుజ్జునుజ్జు కావడంతో క్రేన్స్ సహకారంతో అడ్వకేట్ మృతదేహన్ని బయటకు తీశారు. అనంతరం నందిగామ మార్చురీకి తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో కీసర టోల్‌గేట్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి BMW కారుపై బోల్తా పడిన ట్యాంకర్ లారీ
కారు నుజ్జునుజ్జు అవ్వడంతో, అక్కడికక్కడే మృతిచెందిన కారులో ఉన్న శ్రీనివాస్ రావు అనే వ్యక్తి pic.twitter.com/GCfzr05Wbo
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026
ఇది కూడా చదవండి : Accident on NH44 | అంబులెన్సును ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. డ్రైవర్, పేషెంట్ దుర్మరణం
