Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​

నిజామాబాద్తెలంగాణ

Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్​ఎస్​ఎస్ ఏర్పాటు ​: మోహన్​ భగవత్​

హిందువులను సంఘటితం చేయడానికే హెడ్గేవార్​ ఆర్​ఎస్​ఎస్​ను ఏర్పాటు చేశారని ఆ సంస్థ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 8:10 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Mohan Bhagwat RSS

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohan Bhagwat RSS | నిజామాబాద్​ జిల్లా కందకుర్తి (Kandakuthi)లోని కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ (RSS Chief)​ మోహన్​ భగవత్​ శనివారం ప్రారంభించారు. అనంతరం మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సందర్శకుల బుక్​లో​ సందేశాన్ని రాశారు.

Contents
  • Mohan Bhagwat RSS | హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి..
    • Mohan Bhagwat RSS | ఇక్కడి నుంచే…
      • Mohan Bhagwat RSS | పట్టిష్టమైన పోలీసు భద్రత..
      • Mohan Bhagwat RSS | సన్మానాలు

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మాట్లాడుతూ.. హెడ్గేవార్ (Hedgewar)​ జననం, మరణం నాగ్​పూర్​లోనే జరిగిందన్నారు. అయితే ఆయన పూర్వికులు కందకుర్తికి చెందిన వారని చెప్పారు. దీంతో ఇక్కడ స్ఫూర్తి కేంద్రం నిర్మించాలని యోచించామన్నారు. కందకుర్తి ప్రాశస్త్యం తనకు ఈ రోజు తెలిసిందన్నారు.

Mohan Bhagwat RSS | హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి..

గరుడ్మంతుడు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి తన తల్లిని బానిసత్వం నుంచి విముక్తి చేశారని మోహన్​ భగవత్​ తెలిపారు. అనంతరం ఆ అమృతాన్ని తిరిగి తీసుకెళ్లి ఇంద్రుడికి ఇచ్చారని చెప్పారు. తన కోసం అమృతం తేలేదని, తల్లిని బానిసత్వం నుంచి విడిపించాడనికి తెచ్చాడని చెప్పారు. హెడ్గేవార్ ​సైతం తల్లి భారతమాతను దాస్య శృంఖాలల నుంచి విడిపించడానికి ఆర్​ఎస్ఎస్​ను ఏర్పాటు చేశారన్నారు. బ్రిటిష్​ వాళ్లకంటే ముందు ఎంతో మందిని విదేశీయులు భారత్​ను పాలించారన్నారు. హిందువులు ఏకంగా లేకపోవడంతోనే ఇది జరిగిందన్నారు. భవిష్యత్​లో సైతం హిందూ సమాజం జాగృతం కాకపోతే బానిసత్వం తప్పదని ఆయన భావించారని చెప్పారు. దీంతో హిందువుల్లో చైతన్యం కోసం ఆర్​ఎస్ఎస్​ను స్థాపించారని మోహన్​ భగవత్​ తెలిపారు.

Mohan Bhagwat RSS | ఇక్కడి నుంచే…

హిందూ సమాజాన్ని ఆదర్శంగా మార్చడానికి హెడ్గేవార్​ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో ఎంతోమంది నడుస్తున్నారని చెప్పారు. హెడ్గేవర్​కు కందకుర్తి నుంచి సేవా భావం, దేశ భక్తి వచ్చాయన్నారు. కందకుర్తిలోని మట్టిలో సైతం హెడ్గేవార్​ స్ఫూర్తి ఉందన్నారు. నేడు ఆయన చూపిన మార్గంలో స్ఫూర్తి మందిరం ఏర్పాటు చేసుకున్నామని, భవిష్యత్​లో ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని సూచించారు.

Mohan Bhagwat RSS | పట్టిష్టమైన పోలీసు భద్రత..

మోహన్​ భగవత్ పర్యటన సందర్భంగా పోలీస్​శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. కేంద్ర పారా మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టీ బృందాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీపీ సాయిచైతన్య ఏర్పాట్లను దగ్గరుంచి పర్యవేక్షించారు. ఎంపీ అర్వింద్​, ఎమ్మెల్యేలు సుదర్శన్​రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ, రాకేష్​రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్​, కందకుర్తి సర్పంచ్​ గియాజుద్దీన్, ఆర్​ఎస్​ఎస్​ ప్రముఖులు పాల్గొన్నారు.

Mohan Bhagwat RSS | సన్మానాలు

స్మృతి వనం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అందరిని సన్మానించారు. సహకరించిన దాతలు, నిర్మాణంలో సాయం చేసిన వారు, స్థపతి, డిజైన్​ చేసిన వారు, నిర్మాణ పనులు చేపట్టిన మేస్త్రీలను ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ సన్మానించారు.

kandakurthi

ఇది కూడా చదవండి : Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..

NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్
Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..
Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి
Sonia Gandhi Health | సోనియా గాంధీకి అస్వస్థత.. ఢిల్లీ గంగారాం ఆసుపత్రికి తరలింపు!
BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
TAGGED:hedgewars legacyHindu unityIndian Politicskandukurthi eventMohan Bhagwatrss chief speechrss newsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Geo Special Technology | Geo Special Technology | తెలంగాణ అభివృద్ధిలో జియో స్పెషల్​ టెక్నాలజీస్​ కీలకపాత్ర..
Next Article Indian Family System | Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?