అక్షరటుడే, కామారెడ్డి: Indian Family System | భారతదేశం సనాతన ధర్మాన్ని(Sanatana Dharma) పాటిస్తుందని, ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ (Mahadev Swamij) అన్నారు. కామారెడ్డి (Kamareddy news) పట్టణంలో శనివారం రాత్రి అశోక్ నగర్ బస్తీ ఆధ్వర్యంలో వాసవి పబ్లిక్ స్కూల్ మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు.
Indian Family System | హిందువుగా పుట్టడం అదృష్టం..
కార్యక్రమంలో పాల్గొన్న మహాదేవ్ స్వామీజీ మాట్లాడుతూ.. సనాతన ధర్మం పాటించే గొప్ప దేశంలో హిందువుగా పుట్టడం మన అదృష్టమన్నారు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని, బయట దేశాల్లో కుటుంబ వ్యవస్థ కాంట్రాక్ట్ పద్దతిలో ఉంటుందన్నారు. నచ్చితే కలిసి జీవిస్తారని, అగ్రిమెంట్తో కాలం వెళ్లదీస్తారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రులను మమ్మి, డాడీ అని పిలుస్తున్నారని, అలా కాకుండా అమ్మానాన్న అని పిలవాలని సూచించారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. భగవద్గీత పఠిస్తే జీవన విధానం మారిపోతుందని, ఓంకారంతో ప్రాణాయామం లభిస్తుందని, అరగంట ప్రాణాయామంతో జబ్బులు మాయం అవుతాయని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు ఆచార వ్యవహారాలను కచ్చితంగా పాటించాలన్నారు. పిల్లలకు హిందూధర్మాన్ని చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హిందువులు మేల్కొనాలని, ఐక్యమత్యమే మహాబలం అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు : మోహన్ భగవత్
