Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు

క్రైంహైదరాబాద్

E Cigarette Racket | ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు

హైదరాబాద్​ నగరంలో ఈ సిగరెట్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ.34 లక్షలు విలువ చేసే నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 11, 2026 9:45 సా.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
E Cigarette Racket

అక్షరటుడే, వెబ్​డెస్క్ : E Cigarette Racket | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఈ సిగరెట్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. నాంపల్లి బజార్‌ఘాట్‌లో దాడులు చేశారు. రూ.34 లక్షలు విలువ చేసే నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహ్మద్ అహ్మద్, మహ్మద్ అస్జద్ రజా, వినీత్ మంత్రిని అరెస్ట్ చేశారు.

Contents
  • E Cigarette Racket | వల పన్ని..
    • E Cigarette Racket | అత్తాపూర్​లో..
      • E Cigarette Racket | వాట్సాప్​ ద్వారా..

నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్ల అక్రమ విక్రయాలపై పోలీసులు దృష్టి పెట్టారు. నాంపల్లి పోలీసుల (Nampally Police) సహకారంతో టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. రూ.34.03 లక్షల విలువైన 999 ఎలక్ట్రానిక్ సిగరెట్లు (వేప్‌లు)తో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

E Cigarette Racket | వల పన్ని..

విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజర్‌ఘాట్‌లోని ‘ఎ’ బ్యాటరీ లైన్ సమీపంలో పోలీసు బృందాలు వల పన్ని నిందితులను పట్టుకున్నాయి. ఆపరేషన్‌లో సేల్స్‌మెన్ మహమ్మద్ అహ్మద్ (36), వెల్డర్ మహమ్మద్ అస్జాద్ రజా అలియాస్ అర్హాన్ (30) అనే ఇద్దరు వ్యక్తులు దొరికారు. అహ్మద్ ద్విచక్ర వాహనంపై 180 నిషేధిత ఇ-సిగరెట్లను డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా పట్టుబడగా, వాటిని స్వీకరించిన వ్యక్తిగా రజాను గుర్తించారు. మూడో నిందితుడైన వినీత్ మంత్రి ఆదేశాల మేరకు ఈ లావాదేవీ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

E Cigarette Racket | అత్తాపూర్​లో..

అరెస్ట్ అయిన ఇద్దరిని విచారించగా.. ప్రధాన సూత్రధారి వినీత్ మంత్రి (33) అని తెలిపారు. అతడిని అత్తాపూర్‌లోని నివాసంలో గుర్తించారు. అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నిషేధిత ఎలక్ట్రానిక్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

E Cigarette Racket | వాట్సాప్​ ద్వారా..

నిందితులు ఈ సిగరెట్లు డెలివరీ చేయడానికి వాట్సాప్, టెలిగ్రామ్ వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి, రజాలు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈ దందాను నడిపారని పేర్కొన్నారు. అక్కడ వారు స్టాక్ అప్‌డేట్‌లను పంచుకుంటూ, కస్టమర్లతో అమ్మకాలను సమన్వయం చేసుకున్నారని వెల్లడించారు. ఆన్​లైన్​లోనే చెల్లింపులు స్వీకరించేవారు. నిషేధిత సరుకును పంపిణీ చేయడానికి నిందితులు రాపిడో (Rapdio), పోర్టర్ వంటి డెలివరీ సేవలను సైతం ఉపయోగించడం గమనార్హం. నిందితులు ఢిల్లీకి చెందిన అంకిత్ అనే వ్యక్తి నుంచి భారీ మొత్తంలో ఈ-సిగరెట్లను కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి : Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు

Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
BMW Car Accident | బీఎండబ్ల్యూ కారు బీభత్సం
Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ
Hyderabad Timber Depot Fire | హైదరాబాద్​లో మరో అగ్ని ప్రమాదం
Anirudh Hyderabad Concert | నేడు హైదరాబాద్​లో అనిరుధ్​ మ్యూజిక్​ కాన్సర్ట్.. ట్రాఫిక్​ ఆంక్షలు
TAGGED:black market salescrime newse cigarette racketHyderabad Policeillegal vapes indiatask force raidsvaping ban india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Diesel Export Duty Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు
Next Article Financial Plan Financial Plan | ధరలు పెరిగినా ఆదాయం తగ్గినా డోంట్ వర్రీ.. ఈ ఫైనాన్షియల్ టిప్స్ పాటిస్తే చాలు!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?