అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Iran talks | అమెరికా – ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నత స్థాయి శాంతి చర్చలు 21 గంటల పాటు సాగాయి. అయినా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యునైటెడ్ స్టేట్స్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రకటించారు. ఈ పరిణామం ఇరాన్‌కు మరింత నష్టం చేయనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
US Iran talks | సుదీర్ఘంగా కొనసాగిన చర్చలు
ఇస్లామాబాద్‌లో జరిగిన కీలక సమావేశాల్లో అమెరికా తరపున పాల్గొన్న బృందానికి జేడీ వాన్స్ నేతృత్వం వహించారు. ఇరాన్ ప్రతినిధులతో లోతైన చర్చలు జరిగాయని తెలిపారు. “21 గంటల పాటు చర్చలు సాగాయి. ఇరాన్ అధికారులతో అనేక ముఖ్యమైన అంశాలపై వివరణాత్మక సంభాషణలు జరిగాయి. ఇది సానుకూల విషయం. అయితే దురదృష్టవశాత్తు ఏ ఒప్పందానికీ రాలేదు” అని వాన్స్ వివరించారు.
US Iran talks | ఇరాన్‌కే ఎక్కువ నష్టం
చర్చల్లో ఎలాంటి ఒప్పందం జరగకపోవడం అమెరికా కంటే ఇరాన్‌కు ఎక్కువ నష్టమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. “ఇరాన్ మా ప్రతిపాదనలను అంగీకరించడానికి నిరాకరించింది. మా షరతులను తిరస్కరించింది. కాబట్టి మేం ఎలాంటి ఒప్పందం లేకుండానే అమెరికాకు తిరిగి వెళ్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | US-Iran peace talks | Islamabad, Pakistan: US Vice President JD Vance says, “…The bad news is that we have not reached an agreement. I think that is bad news for Iran much more than it’s bad news for the USA. So, we go back to the US having not come to an… pic.twitter.com/jWHpJYemYz
— ANI (@ANI) April 12, 2026
ఇది కూడా చదవండి..: Hormuz Sea Mines | హర్ముజ్‌లో మరో సమస్య.. సీమైన్స్ ఎక్కడున్నాయో తెలియదంటున్న ఇరాన్
