అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2026 Gloves Issue | ఐపీఎల్ 2026లో Ipl 2026 చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. శనివారం రాత్రి చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ సీజన్‌లో తమ తొలి గెలుపును నమోదు చేసింది. అయితే మ్యాచ్ ఫలితం కంటే 19వ ఓవర్‌లో జరిగిన ఒక వివాదాస్పద సంఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును నిలబెట్టాడు.
IPL 2026 Gloves Issue | ఢిల్లీ పోరాటం విఫలం
కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (59) అతనికి మంచి తోడ్పాటు అందించాడు. చివర్లో శివమ్ దూబే (20) వేగంగా పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్ (60) పోరాటం కొనసాగించాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీకి Delhi ఆశలు కనిపించాయి. కానీ చెన్నై బౌలర్ జేమీ ఓవర్టన్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ వంటి కీలక ఆటగాళ్లు విఫలమవడంతో ఢిల్లీ 189 పరుగులకే పరిమితమైంది.
IPL 2026 Gloves Issue | గ్లోవ్స్ చెమటతో తడవడంతో..
మ్యాచ్‌లో అసలు ట్విస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో చోటుచేసుకుంది. క్రీజులో ఉన్న స్టబ్స్ తన గ్లోవ్స్ Gloves చెమటతో తడవడంతో వాటిని మార్చుకోవాలని కోరాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్లోవ్స్ (IPL 2026 Gloves Issue) తెప్పించేందుకు సంకేతం ఇచ్చినా, ఫీల్డ్ అంపైర్లు అనుమతి ఇవ్వలేదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం గ్లోవ్స్ చిరిగిపోతే మాత్రమే ఓవర్ మధ్యలో మార్చుకునే అవకాశం ఉంటుంది. కేవలం చెమట కారణంగా మార్చుకోవడం సమయాన్ని వృథా చేయడమేనని అంపైర్లు భావించారు. అంపైర్ నిర్ణయంతో ఢిల్లీ డగౌట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. కోచ్, సపోర్ట్ స్టాఫ్ ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగారు. గ్లోవ్స్ మార్చుకోలేకపోయిన స్టబ్స్ అదే ఓవర్‌లో బంతిని సరిగా ఆడలేక క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ విజయావకాశాలు పూర్తిగా చిద్రమయ్యాయి. అంపైర్ల నిర్ణయం వల్లే స్టబ్స్ ఏకాగ్రత దెబ్బతిన్నదని, అదే ఓటమికి కారణమైందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటనతో ఐపీఎల్ 2026లో అంపైరింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది. నిబంధనల ప్రకారం తీసుకున్న నిర్ణయమే అయినప్పటికీ, మ్యాచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత సడలింపు ఇవ్వాల్సిందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చెన్నై విజయం కంటే ఈ గ్లోవ్స్ వివాదమే మ్యాచ్‌ను మరింత హైలైట్ చేస్తోంది. ఈ అంశంపై ఐపీఎల్ నిర్వాహకులు స్పందిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి..: Yuzvendra Chahal Smoking | బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగిన చాహల్.. మందు మానేసానని చెప్పి, ఇలా సిగరెట్ తాగడమేంటి?
