Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్

అంతర్జాతీయం

US Iran Talks | అమెరికా గొంతెమ్మ కోరిక‌లు.. అందుకే చ‌ర్చ‌లు ఆపామంటున్న ఇరాన్

పాక్​లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అమెరికా కఠిన షరతులు, ఇరాన్ నిరాకరణతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 12, 2026 10:36 ఉద.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
US Iran Talks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Iran Talks | పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో (Islamabad) జరిగిన అమెరికా–ఇరాన్ కీలక చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు కొనసాగిన ఈ చర్చలు విఫలమవడంతో ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్‌ఐబీ ప్రకారం, చర్చలు విఫలమవడానికి అమెరికా పెట్టిన కఠినమైన, అన్యాయమైన షరతులే కారణమని ఇరాన్ పేర్కొంది. తమ దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఇరాన్ బృందం నిరంతరంగా చర్చలు జరిపిందని, అనేక ప్రతిపాదనలు ఇచ్చినా అమెరికా మొండిగా వ్యవహరించడంతో పురోగతి సాధ్యపడలేదని వెల్లడించింది.

Contents
  • US Iran Talks | అమెరికా వాదన
    • US Iran Talks | వాన్స్​ హెచ్చరికలు

US Iran Talks | అమెరికా వాదన

అమెరికా బృందానికి నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, తాము ఇచ్చిన ఆఖరి, ఉత్తమ ఆఫర్‌ను ఇరాన్ తిరస్కరించిందన్నారు. ముఖ్యంగా అణు ఆయుధాల తయారీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అమెరికా కోరిందని తెలిపారు. ఇరాన్ నిబంధనలను అంగీకరించకపోవడం ఆ దేశానికే నష్టమని వాన్స్ వ్యాఖ్యానించారు. చర్చల సమయంలో తాను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) పలుమార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. 1979 విప్లవం తర్వాత ఈ స్థాయిలో అమెరికా–ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై ఆసక్తి నెలకొంది.

US Iran Talks | వాన్స్​ హెచ్చరికలు

గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ (Israel) దళాలు ఇరాన్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరస్పర దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించడంతో శాంతి చర్చలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఆర్థిక, సైనిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్ Iran , అమెరికా షరతులకు తలొగ్గకపోవడం ఆ దేశ భవిష్యత్తుకే ప్రమాదకరమని వాన్స్ హెచ్చరించారు. మరోవైపు ఈ చర్చలు విఫలం కావడంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చర్చలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వానికి అమెరికా ఉపాధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పాక్ ప్రధానమంత్రి, సైన్యాధిపతి తీసుకున్న చొరవను ప్రశంసించారు.

దీనిని కూడా చదవండి : Iran Peace Talks | శాంతి చర్చలకు ఇరాన్ ప్రతినిధులు.. ర‌క్తంతో త‌డిసిన స్కూల్ బ్యాగులు, బూట్ల‌తో పాకిస్తాన్‌కి..!

Minuteman III Missile | అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా.. ఇరాన్‌పై దాడుల వేళ ప్రయోగం..
Gold Rates India | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ప్ర‌ధాన న‌గ‌రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!
India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..
US War on Iran | మిడిల్ ఈస్ట్ యుద్ధం మరింత తీవ్రం.. ఇరాన్‌పై భారీ దాడులకు సిద్ధ‌మ‌వుతున్న అమెరికా
Kharg Island Tensions | ఖర్గ్​ ద్వీపం స్వాధీనంపై ట్రంప్​ కీలక వ్యాఖ్యలు
TAGGED:diplomatic talksglobal politicsiran nuclear issueIslamabad meetingMiddle East tensionsUS Foreign Policyus iran talks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Heat Wave Heat Wave | భానుడి ఉగ్రరూపం.. మండుతున్న ఎండలు
Next Article Inter Results 2026 Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?