అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Results 2026 | ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదివారం ఉదయం రిజల్ట్స్ రిలీజ్ చేశారు.
Inter Results 2026 | వెబ్సైట్లో..
ఇంటర్ విద్యార్థుల (Inter Students) ఉత్కంఠకు తెరపడింది. జనరల్, వొకేషనల్ కోర్సుల ఫలితాలను అధికారులు వెల్లడించారు. https://tgbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కాగా ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 4,89,126 మంది ఫస్టియర్, 5,07,949 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
Inter Results 2026 | 70.5 శాతం ఉత్తీర్ణత
ఇంటర్లో జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత సాధించారు. కే కేశవరావు మాట్లాడుతూ.. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభివనందనలు తెలిపారు. ఫెయిల్ అయిన వారు అధైర్యపడొద్దన్నారు. ఫస్టియర్ మొత్తం విద్యార్థులు 4,89,123 మంది ఉండగా.. 3,23,807 మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 66.02 శాతం నమోదు అయింది. బాలికల ఉత్తీర్ణత 74.4 శాతం.. బాలుర ఉత్తీర్ణత 57.69 శాతం కావడం గమనార్హం. సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 75.34 కాగా, అమ్మాయిలు 78.65 శాతం, అబ్బాయిలు 62.50 శాతం పాస్ అయ్యారు.
దీనిని కూడా చదవండి : Mohan Bhagwat RSS | హిందువులను సంఘటితం చేయడానికే ఆర్ఎస్ఎస్ ఏర్పాటు : మోహన్ భగవత్
