Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

సినిమా - Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

సినిమా

Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

బోల్డ్ ఫొటోలు, సబ్‌స్క్రిప్షన్ కంటెంట్ ఆరోపణలతో యాంకర్ విష్ణుప్రియపై ఏఐఎస్‌ఎఫ్ నేతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 12, 2026 11:17 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
11 గంటలు ago
Share
Vishnu Priya

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vishnu Priya | యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, టెలివిజన్ మరియు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విష్ణుప్రియ భీమినేని Vishnu Priya ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. విజయవాడ సూర్యారావుపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఫిర్యాదు సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ నేతృత్వంలో ఈ ఫిర్యాదు ఇచ్చారు. విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Contents
  • Vishnu Priya | నేత‌ల ఆందోళ‌న‌..
    • Vishnu Priya | ఇన్‌స్టా ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలి

Vishnu Priya | నేత‌ల ఆందోళ‌న‌..

ఇన్‌స్టాగ్రామ్‌లో Instagram విష్ణుప్రియ అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ కంటెంట్‌ను వీక్షించాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నెలకు సుమారు రూ.399 చెల్లిస్తే మాత్రమే కొన్ని ప్రత్యేక వీడియోలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సెలబ్రిటీగా ఉన్న వ్యక్తులు ఇటువంటి కంటెంట్‌ను ప్రోత్సహించడం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బుల కోసం ఇలాంటి మార్గాలు అనుసరించడం సమాజానికి మంచిది కాదని విమర్శించారు.

Vishnu Priya | ఇన్‌స్టా ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలి

ఈ ఫిర్యాదులో ఏఐఎస్‌ఎఫ్ AISF నేతలు రెండు ముఖ్య డిమాండ్లు చేశారు. విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వెంటనే బ్లాక్ చేయాలి, ఐటీ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి అని అన్నారు. ఇప్పుడు ఈ ఫిర్యాదు విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ఆమెను విమర్శిస్తుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్ఛగా అభిప్రాయపడుతున్నారు. విష్ణుప్రియ ‘పోవే పోరా’ వంటి షోలతో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత యూట్యూబ్ వీడియోలు, డ్యాన్స్ క్లిప్స్ ద్వారా క్రేజ్ పెంచుకున్నారు. అనంతరం రియాలిటీ షోల్లో కూడా పాల్గొని మరింత పాపులర్ అయ్యారు.

ఇది కూడా చదవండి..: Singer Mangli | మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. పంజాగుట్ట పీఎస్​లో కేసు నమోదు 

 Ramayana Glimpse Release | రామాయణం చిత్రం… రామ గ్లింప్స్​ విడుదల అప్పుడే..
Actress Suicide Case | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి సూసైడ్..
Vijay Rashmika Wedding | విరోష్ పెళ్లి సందడి : దేశవ్యాప్తంగా స్వీట్లు, దేవాలయాల్లో అన్నదానం…
Movie Ticket Prices | కొత్త సినిమాలకు ఊరట… టికెట్​ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
TAGGED:aisf complaintcyber crime indiainfluencer controversyinstagram controversysocial media issuetelugu anchor newsvishnu priyavishnu priya instagram
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Inter Results 2026 Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల
Next Article Women Reservation 2029 | Women Reservation 2029 | మహిళలకు రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం.. 2029 ఎన్నికల నాటికి అమలు: ఎంపీ అర్వింద్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?