అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa Demolitions Ailapur | సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు రెండో రోజు కొనసాగుతున్నాయి. శనివారం న్యాయవాది ముఖీమ్ ఫామ్‌హౌజ్‌ను అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సైతం పెద్ద ఎత్తున పోలీసులు (Police), అధికారులు, హైడ్రా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ ప్రారంభించారు.
ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ముఖీ సోదరుడు అజీమ్‌కు చెందిన ఆరు అంతస్తుల భవనంలో కొంత భాగం శనివారం కూల్చేసిన అధికారులు, మిగతా భాగాన్ని ఆదివారం కూల్చివేస్తున్నారు. గతంలో ఈ భూముల్లో నిర్మాణాలపై కోర్టు స్టే విధించింది. అయినా కూడా చేపట్టిన భవనాలను తాజాగా హైడ్రా కూల్చి వేస్తోంది.
Hydraa Demolitions Ailapur | 40 ఎకరాల్లో..
ఇక్కడ ప్రభుత్వ భూమిలో న్యాయవాది ముఖీమ్ ఫామ్ హౌజ్ నిర్మించుకున్నాడు. అతడి సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం కట్టాడు. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా ఇంటిని సైతం నిర్మించాడు. ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. గుర్రాల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయా నిర్మాణాలను హైడ్రా (Hydraa) తొలగిస్తోంది. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో, కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది.
Ameenpur: HYDRAA Demolitions Continue for Second Day
HYDRAA authorities continued demolition drives for the second consecutive day in Ameenpur mandal under Patancheru constituency.
Illegal Structures Targeted
Officials are demolishing unauthorized constructions in the… pic.twitter.com/5jPeJEj4Kv
— prudvi charan (@pudvicharan) April 12, 2026
ఇది కూడా చదవండి : Inter Results 2026 | ఇంటర్ ఫలితాలు విడుదల
