అక్షరటుడే, వెబ్డెస్క్ : ATM Cash Theft | ఏటీఎంలలో డిపాజిట్ చేయాల్సిన డబ్బులతో ఇద్దరు సిబ్బంది పరారు అయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్ (Secunderabad)లో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఒక నగదు నిర్వహణ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏటీఎం డిపాజిట్ల కోసం ఉద్దేశించిన దాదాపు రూ.కోటితో పారిపోయినట్లు తెలుస్తోంది. నిందితులను వాసిరెడ్డి, లతీఫ్‌గా గుర్తించారు. ఈ నిందితులకు ఏజెన్సీకి చెందిన బోయిన్‌పల్లి కార్యాలయం నుంచి ఏటీఎంలలోకి నగదును లోడ్ చేసే బాధ్యతను అప్పగించారు. అయితే వారు గత రెండు రోజులుగా కనిపించడం లేదు.
ATM Cash Theft | కనిపించకపోవడంతో..
సాధారణ ఆడిటింగ్ సమయంలో ఇద్దరు నిందితులు గైర్హాజరు కావడం కంపెనీలో అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలో సిబ్బంది విచారణ చేపట్టారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలోని కనీసం 8 ఏటీఎంలలో నగదు జమ కాలేదని అంతర్గత విచారణలో వెల్లడైంది. దీంతో ఏజెన్సీ మేనేజర్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ (SR Nagar Police Station)లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Smart Number Plate Scam | పోలీసులకు చిక్కకుండా ప్లాన్.. టెక్నాలజీతో కారు నంబర్ ప్లేట్ మార్పు
