అక్షరటుడే, కామారెడ్డి: VRK Inter Results | ఇంటర్ ఫలితాలు (inter results) ఆదివారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని వీఆర్కే (VRK College) విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు.
VRK Inter Results | ఫస్ట్, సెకండియర్లలో..
ఆదివారం విడుదలైన ఫలితాలలో (intermediate education) బైపీసీ సెకండియర్ విద్యార్థిని ఎ.నవోదయ 994 మార్కులు సాధించగా ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పి మైథిలి 993 మార్కులు, సీఈసీ సెకండియర్ విద్యార్థిని అనన్య 982, ఎంపీహెచ్ డబ్ల్యు సెకండియర్ విద్యార్థిని ఎం.అఖిల 987 మార్కులు సాధించారు. అలాగే ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని నాష్ట్ర జమ 466/470, బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని శిరీష 436/440, బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జోబియా తన్వీర్ 435/440, సీఈసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని మదీనా 483 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరితోపాటు చాలామంది విద్యార్థులకు 900 కు పైగా మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల సీఈవో, కరస్పాండెంట్ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి అభినందించారు.
