అక్షరటుడే, ఇందూరు: SSC CGL | ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (Combined Graduate Level) పరీక్షల్లో ఇందూరు విద్యార్థి ప్రణయ్ ఉత్తమ ప్రతిభ చూపాడు. జాతీయ స్థాయిలో 102వ ర్యాంక్ సాధించాడు.
SSC CGL | ట్రాన్స్కో విజిలెన్స్ ఉద్యోగి కుమారుడు ప్రణయ్..
నిజమాబాద్(Nizamabad) ట్రాన్స్కో విజిలెన్స్ (Transco Vigilance) సీఐ జక్కుల శంకర్ రావ్ పెద్ద కుమారుడైన ప్రణయ్ ఈ ఘనత సాధించాడు. ఈ ర్యాంక్ ద్వారా కస్టమ్స్ ఇన్స్పెక్టర్ (Customs Inspector) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సీఐ శంకర్ రావ్ సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని ఇల్లెందు మండలం లలితాపురం గ్రామం. గతంలోనూ ప్రణయ్ ఎస్ఎస్సీలో పోస్టల్ డిపార్ట్మెంట్, వివిధ బ్యాంకుల్లో మొత్తం ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. తాజాగా ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలో జాతీయ స్థాయిలో 102వ ర్యాంకు సాధించి ప్రత్యేకంగా నిలిచాడు.
ఇది కూడా చదవండి: Kalyan Jewellers | మేడిపల్లిలో కళ్యాణ్ జ్యువెలర్స్ నూతన షోరూమ్ ప్రారంభం.. సందడి చేసిన సినీ నటి శ్రీలీల
