అక్షరటుడే, కామారెడ్డి: Electric Pole Removal | ‘స్తంభాలు భయపెడుతున్నాయ్’ శీర్షికన ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనానికి ట్రాన్స్‌కో (TRANSCO Kamareddy) అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలో (Kamareddy) ప్రమాదకరంగా రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాన్ని తొలగించారు.
Electric Pole Removal | పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద..
పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్ పక్కన నిత్యం రద్దీగా ఉన్న రహదారిపై రెండు స్తంభాలు ఉన్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న ఇనుప స్తంభానికి పక్కనే ఉన్న సిమెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన సపోర్టింగ్ వైర్ సైతం ప్రమాదకరంగా మారింది. దీంతో నిత్యం ఈ దారి గుండా వాహనదారులకు ముఖ్యంగా స్కూల్ బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారిందనే సమాచారంతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు.
Electric Pole Removal | తక్షణమే చర్యలు..
ఆదివారం సూపర్ మార్కెట్ పక్కన ప్రమాదకరంగా మారిన సిమెంట్ విద్యుత్ స్తంభంతో పాటు మార్కెట్ భవనంలో కొనసాగుతున్న గౌతమ్ పాఠశాల ముందు ఉన్న మరొక స్తంభాన్ని అధికారులు పూర్తిగా తొలగించారు. సూపర్ మార్కెట్ పక్కన నూతన స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి మరొక స్తంభాన్ని సపోర్టుగా ఏర్పాటు చేశారు. అలాగే గౌతమ్ పాఠశాల (Gautham School) వద్ద ఉన్న పోల్‌ను పూర్తిగా తొలగించి లయోల పాఠశాల (Loyola School) ముందు కొత్తది ఏర్పాటు చేశారు. దారి మధ్యలో ప్రమాదకరంగా మారిన పోల్‌ను గ్యాస్ కట్టర్ సాయంతో పూర్తిగా తీసివేశారు. దాంతో నిజాంసాగర్ చౌరస్తా ప్రధాన రహదారి నుంచి పాఠశాలలు, అపార్టుమెంట్లకు వెళ్లే దారి విశాలంగా మారింది. దీంతో స్థానికులు, అపార్ట్‌మెంట్‌వాసులు ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: ATM Cash Theft | ఏటీఎంలలో పెట్టాల్సిన డబ్బులతో పరారైన సిబ్బంది
