Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kakatiya Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kakatiya Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం

నిజామాబాద్

Kakatiya Nizamabad | ఇంటర్​ ఫలితాల్లో ‘కాకతీయ’ ప్రభంజనం.. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు కైవసం

ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 12, 2026 6:35 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
21 గంటలు ago
Share
Kakatiya Nizamabad

అక్షరటుడే, ఇందూరు: Kakatiya Nizamabad | ఇంటర్మీడియట్​​ ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఇందులో కాకతీయ విద్యార్థులు సత్తా చాటారు. స్టేట్​ ఫస్ట్​, సెకండ్​తో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంటర్ సెకండియర్​లో స్టేట్​ ఫస్ట్​, ఫోర్త్​ ర్యాంకులు, ఫస్టియర్​లో ఇద్దరు విద్యార్థులు స్టేట్ సెకండ్​ ర్యాంకులు, నలుగురు స్టేట్​ నాలుగో ర్యాంకులు పొందారు. ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. డీఈవో అశోక్​ విద్యార్థులను సన్మానించారు.

Contents
  • Kakatiya Nizamabad | సెకండియర్​లో..
    • Kakatiya Nizamabad | ఫస్టియర్​లో..
      • రాష్ట్రంలో అగ్రగామిగా..

Kakatiya Nizamabad | సెకండియర్​లో..

సెకండియర్​ ఎంపీసీలో మృదుల స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు సాధించగా, బైపీసీలో తుబా ఫాతిమా, బి.కావ్య నాలుగో ర్యాంకు సాధించారు. అంతేకాకుండా ఎంపీసీలో హమియా ఉమేమా, వై.గౌతమి ఆరో ర్యాంకు పొందారు. అలాగే డి.కౌచిత, ఏ.సంజన, సీహెచ్​.వైష్ణవి, ఎన్​.రూపాని, కె.కీర్తి, టి.నిత్యశ్రీ, కె.అశ్రిత స్టేట్​ ర్యాంకులు సాధించారు.

Kakatiya Nizamabad | ఫస్టియర్​లో..

ఫస్టియర్​ ఎంపీసీలో బి.మనోగ్న, ఆర్​.అక్షిత స్టేట్​ సెకండ్​ ర్యాంకులు పొందారు. అలాగే ఎస్​.భవాని, సాకేత్​, ఇష్రా మహీన్​, జేఎస్​.రినిత్య మూడో ర్యాంకులు సాధించారు. ఏ.సాయి విఘ్నత, తమన్నా నాజ్​, సిరి వేద స్టేట్​ ర్యాంకులు పొందారు.

ఈ సందర్భంగా కాకతీయ కళాశాల ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల ఛైర్​పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి మాట్లాడుతూ అద్భుతమైన ఫలితాల వెనుక నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. విద్యార్థుల శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందని పేర్కొన్నారు. 90 శాతం మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులు, స్టేట్ ర్యాంకులు సాధించారన్నారు.

Kakatiya Nizamabad

రాష్ట్రంలో అగ్రగామిగా..

స్టేట్ ర్యాంకులే కాకుండా, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతంతో కాకతీయ విద్యార్థులు రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం సంతోషంగా ఉందని విజయలక్ష్మి అన్నారు. అద్భుతమైన విజయాలకు కారకులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు విశేషమైన కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్లు చెరుకూరి రజనీకాంత్​, రామోజీ, తేజస్విని, రాజా, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Kakatiya Nizamabad

ఇది కూడా చదవండి..: Inter Results | నిజామాబాద్​ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..

Pancha Reddy Suresh death | పంచరెడ్డి సురేష్ మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఎమ్మెల్యే ధన్​పాల్​
Judicial Eleven victory | ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్​లో జ్యూడీషియల్ ఎలెవన్​ టీం ఘనవిజయం
Armoor Police | ఆపరేషన్​లో కాలివేలు తీసేస్తారనే భయంతో ప్రాణమే తీసుకున్నాడు..
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
TAGGED:education newsInter resultsintermediate examsKakatiya Nizamabadstate ranksstudent performanceTelangana Educationtoppers list
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tiger Movement Kamareddy | Tiger Movement Kamareddy | ఎల్లంపేట శివారులో పెద్దపులి సంచారం.. పాదముద్రలు సేకరించిన అటవీశాఖ అధికారులు
Next Article BRS name change BRS name change | మళ్లీ టీఆర్​ఎస్​గా బీఆర్​ఎస్​.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?