అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: Addiction Medicine Chairman | ఐఎంఏ (IMA Nizamabad) జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్ విశాల్ (dr vishal) అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్(Addiction Medicine Specialty Section) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఉత్తర్వులు అందాయి.
Addiction Medicine Chairman | వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో విశేష అనుభవం
మానసిక వైద్యంలో భాగంగా వ్యసన సంబంధిత రుగ్మతల చికిత్సలో విశాల్‌కు ఉన్న విశేష అనుభవం, నైపుణ్యం, సేవలను గుర్తిస్తూ ఐఎంఏ ఈ బాధ్యతను ఆయనకు అప్పజెప్పింది. కొన్నేళ్లుగా విశాల్ డీ-అడిక్షన్ సెంటర్ నడుపుతున్నారు. అలాగే ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీ-అడిక్షన్ సెంటర్ (De-addiction Center) ద్వారా వందలాది మంది వ్యసన బాధితులు చికిత్స పొందుతూ సమాజంలో సామాన్య జీవనం గడుపుతున్నారు.
Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ..
ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీలోని (Indian Psychiatric Society) అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ దేశవ్యాప్తంగా వ్యసన వ్యాధులపై అవగాహన కలిగిస్తోంది. అలాగే చికిత్స మార్గదర్శకాలు రూపొందించడం పరిశోధనలకు ప్రోత్సాహం అందించడం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ టి సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరుణ్ మార్వాలే, డాక్టర్ విశాల్ ఆకులను ఏప్రిల్ 18 రాజస్థాన్‌లోని ని జైపూర్‌లో నిర్వహించనున్న నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశానికి ఆహ్వానించారు.
Addiction Medicine Chairman | ప్రజారోగ్య సమస్యగా మత్తుపదార్థాలు
ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. దీనిపై జాతీయస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను జైపూర్(Jaipur) సమావేశంలో సమర్పించనున్నట్లు తెలిపారు. పాఠశాలస్థాయిలోనే మత్తు పదార్థాల నివారణ.. దుష్ప్రభావాలపై ప్రత్యేక అధ్యాయాన్ని హైస్కూల్ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని భారత ప్రభుత్వం వద్ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ద్వారా ప్రతిపాదించనున్నట్లు వెల్లడించారు. యువతను వ్యసనాల నుండి కాపాడడం సమాజం మొత్తం బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Eatela Rajender comments | ప్రజలు కట్టే పన్నులకు మేము కాపలాదారులం : ఎంపీ ఈటల
