అక్షరటుడే, వెబ్డెస్క్: Daily Horoscope | ఇవాళ గ్రహ గతులు , గోచార ఫలాలు కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాల, అందిస్తున్నాయి.. ముఖ్యంగా జాతక చక్రంలో అనుకూలమైన మార్పులు కనిపిస్తుండటంతో, గతంలో పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ధన స్థానం బలంగా ఉండటం వల్ల ఆకస్మిక లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అయితే, అష్టమ స్థానంలో గ్రహాల సంచారం వల్ల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు దశ – అంతర్దశల ప్రభావాన్ని గమనించి కొత్త పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం మేలు.
Daily Horoscope | మేష రాశి
ఇవాళ చాలా ఉత్సాహంగా, సంతోషంగా గడుస్తుంది. తోబుట్టువుల నుంచి పూర్తి మద్దతు, సహాయం లభిస్తుంది. మీ కష్టానికి, అంకితభావానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కుటుంబ జీవితం మరింత ప్రశాంతంగా ఉండటం కోసం, సరస్వతీ దేవిని పూజించండి.
Daily Horoscope | వృషభ రాశి
మీరు శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులు ఇవాళ కాస్త అప్రమత్తంగా ఉండాలి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. పిల్లలు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వేడుకల్లో పాల్గొనడం ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
Daily Horoscope | మిథున రాశి
ఖాళీగా ఉండకుండా ఏదైనా ఉపయోగకరమైన పనిలో నిమగ్నమవ్వండి. ఇది ఆదాయాన్ని పెంచుకోవడానికి తోడ్పడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పని తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ వలన అందరి ప్రశంసలు అందుకుంటాయి.
Daily Horoscope | కర్కాటక రాశి
కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. దీనివల్ల ధనలాభం కలిగి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇవాళ జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల మీ గౌరవానికి చిన్నపాటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది.
Daily Horoscope | సింహ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీ అవసరాల, తీర్చడంలో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఆఫీసులో మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. భవిష్యత్తు కోసం మంచి ప్లాన్స్ వేసుకుంటారు.
కన్యా రాశి
ఇవాళ కొత్త విషయాన్ని నేర్చుకుంటాయి. తెలిసిన వ్యక్తుల ద్వారా కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మీలోని మంచి ఆలోచనలు, సలహాల ద్వారా కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇవాళ కొత్తగా ఉమ్మడి వ్యాపార ఒప్పందాలు (Partnerships) చేసుకోకపోవడం మంచిది. అవసరమైతే ఆప్తమిత్రుల సలహా తీసుకోండి.
తులా రాశి
ఇవాళ మీరు పూర్తి శక్తితో, ఉత్సాహంగా ఉంటారు. వచ్చే ప్రతి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. నగలు లేదా అలంకరణ వస్తువులపై పెట్టే పెట్టుబడి భవిష్యత్తులో మంచి లాభాల, తెస్తుంది. మీ కింద పనిచేసే వారు సరిగ్గా పని చేయకపోవడం వల్ల కొంత విసుగు కలగవచ్చు.
వృశ్చిక రాశి
కుటుంబ సభ్యుల దగ్గర తీసుకున్న అప్పుల, వీలైనంత త్వరగా తీర్చివేయండి. లేదంటే అనవసరమైన చిక్కులు రావచ్చు. పిల్లల అభివృద్ధి లేదా వారికి లభించే గౌరవం మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. వారు మీ ఆశయాల, నెరవేరుస్తారు. కష్ట కాలంలో ఒక ఆప్తమిత్రుడు అండగా నిలిచి, మీ బాధ, పంచుకుంటారు. కొత్త వ్యాపార ఒప్పందాలు లేదా పార్టనర్‌షిప్ పత్రాలపై సంతకాలు చేయకపోవడం మంచిది.
ధనుస్సు రాశి
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ,నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. అదృష్టం కలిసి వచ్చి మీ కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో మీ మాట నెగ్గాలని పట్టుబట్టకండి. దీనివల్ల అనవసరమైన వాదనలు, విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందరితో సానుకూలంగా ఉండండి.
మకర రాశి
కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండండి. నిగ్రహం పాటిస్తే సమస్యలు సర్దుకుంటాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వారు అనారోగ్యం పాలయ్యే సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలకు, నిర్ణయాలకు కుటుంబ సభ్యుల ,నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇతరుల ప్రశంసలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
కుంభ రాశి
శారీరక లేదా మానసిక ఇబ్బందులు ఉన్నా, మీ తెలివితేటలు , సానుకూల ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. గతంలో మీరు ఇచ్చిన అప్పు అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. ఇవాళ మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. అందరితో కలివిడిగా గడుపుతారు. మీ సలహాల కోసం ఇతరులు ఎదురుచూస్తారు , మీరు చెప్పినదానికి విలువ ఇస్తారు.
మీన రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీనివల్ల అవసరమైన ముఖ్యమైన వస్తువుల, కొనుగోలు చేయగలుగుతారు. ఆఫీసులో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇవాళ పని పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడటానికి , శుభ ఫలితాల కోసం.. ఇష్ట దైవాన్ని పూజించండి.
ఇది కూడా చదవండి..: Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
