అక్షరటుడే, ఆర్మూర్: Armoor Cordon Search | ఆర్మూర్ (Armoor) పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో పోలీసులు (Armoor Police) ఆదివారం కార్డన్ సెర్చ్ (Cordon Search) నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 45 ఇళ్లను వారు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Armoor Cordon Search | ధ్రువపత్రాలు లేని బైక్‌లు సీజ్..
ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు సమర్పించని 48 బైక్‌లు, 7 ఆటోలు, కార్‌ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, మాడిఫైడ్ సైలెన్సర్లను (Modified Silencers) బిగించిన వాహనాలు, 15 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, 2 ఆటోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud) మాట్లాడుతూ.. అనుమానితులు ఎవరైనా కొత్తగా కాలనీలో సంచరిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అలాగే వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Addiction Medicine Chairman | ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అడిక్షన్ మెడిసిన్ స్పెషాలిటీ సెక్షన్ ఛైర్మన్‌గా డాక్టర్ విశాల్
