Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!

బిజినెస్​తాజా వార్తలు

April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు!

అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు మార్పులు చవిచూస్తున్నాయి. ముఖ్య నగరాల్లో గోల్డ్ రేట్స్ స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 13, 2026 8:07 ఉద.
Naresh chandan
8 గంటలు ago
Share
April 13 Gold Rates
April 13 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 13 Gold Rates | అమెరికా–ఇరాన్ దేశాల మధ్య చర్చలు ఫలించకపోవడంతో యుద్ధ భయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అనిశ్చిత పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతూ, ముఖ్యంగా బంగారం, వెండి ధరల్లో Silver Prices హెచ్చుతగ్గులకు దారితీస్తున్నాయి.

Contents
  • April 13 Gold Rates | మారుతున్న ధ‌ర‌లు..
    • April 13 Gold Rates | ఉద్రిక్తతలు పెరగడం

సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, గ్లోబల్ ఈవెంట్స్ ప్రభావంతో ధరల్లో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తోంది. భారతీయ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.1,52,830గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,090గా నమోదైంది.

April 13 Gold Rates | మారుతున్న ధ‌ర‌లు..

ప్రధాన నగరాల్లో ధరలు చూస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,53,810, 22 క్యారెట్ల ధర రూ.1,40,990 కాగా, ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090గా ఉంది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,52,980, 22 క్యారెట్ల ధర రూ.1,40,240 కాగా, కోల్‌కతాలో 24 క్యారెట్ల ధర రూ.1,52,510, 22 క్యారెట్ల ధర రూ.1,41,010, బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090గా ట్రేడ్ అయింది.

ఇక‌ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం Vishakapatnam నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ.1,52,830, 22 క్యారెట్ల ధర రూ.1,40,090గా కొనసాగుతోంది ఇక వెండి ధరలు కూడా భారీగా మార్పు చవిచూస్తున్నాయి. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.264.90 ఉండగా, కిలో ధర రూ.2,64,900కు చేరింది.

April 13 Gold Rates | ఉద్రిక్తతలు పెరగడం

మార్కెట్ నిపుణుల ప్రకారం, అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు విఫలమవడం, హోర్ముజ్ జలసంధి విషయంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఈ ప్రభావంతోనే బంగారం, వెండి ధరలు Silver Prices ఈరోజు సుమారు 3 శాతం వరకు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఇప్పటికే గరిష్ట స్థాయిలకు చేరుకున్నప్పటికీ, భవిష్యత్తులో మరింత పెరుగుదల అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడిదారులు “బై ఆన్ డిప్స్” విధానాన్ని అనుసరించడం మంచిదని సూచిస్తున్నారు.

POCSO Jail Sentence | కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. వరుసగా మూడో పోక్సో కేసులోనూ నిందితుడికి 20 ఏళ్ల జైలు
Ramky | దిఘి పోర్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ప్రాజెక్టును దక్కించుకున్న రామ్‌కీ ఇన్‌ఫ్రా
Gold Price Today India | స్థిరంగా బంగారం ధరలు.. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎలా ఉన్నాయంటే..!
March 22 Gold Rates | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. దేశ వ్యాప్తంగా నేటి పరిస్థితి ఏమిటంటే!
Judiciary Corruption Chapter | 8వ తరగతిలో “న్యాయవ్యవస్థలో అవినీతి” పాఠ్యాంశం.. ఎన్​సీఈఆర్టీపై సుప్రీంకోర్టు మండిపాటు
TAGGED:April 13 Gold RatesBullion Market NewsGold investment Indiagold price april 2026Gold Price UpdateGold Rates Indiaindia gold marketSilver price todaysilver rates india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vastu Tortoise Vastu Tortoise | ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే అదృష్టమేనా? వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?
Next Article US Iran Tensions US Iran Tensions | ట్రంప్‌ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్‌.. హర్మూజ్ దిగ్బంధన ఆదేశాలపై ఇరాన్ ఘాటు హెచ్చరిక
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?