అక్షరటుడే, వెబ్‌డెస్క్: April 13 Pre Market Analysis | అమెరికా, ఇరాన్‌ల మధ్య పాకిస్థాన్‌లో జరిగిన చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా(West Asia)లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధనానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడంతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు వంద డాలర్లు దాటింది. ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లు(Stock markets) నెగెటివ్‌గా స్పందిస్తున్నాయి.
April 13 Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.35 శాతం లాభపడగా.. ఎస్ అండ్ పీ 0.11 శాతం నష్టపోయింది. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.73 శాతం నష్టంతో ఉంది.
April 13 Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.17 శాతం లాభపడగా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.03 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.01 శాతం నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.15 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.19 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.06 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.97 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.33 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.24 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.02 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 1.51 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు 27 రోజుల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 672 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు వరుసగా 30వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.97 నుంచి 1.13 కి పెరిగింది.
- విక్స్ 7.72 శాతం తగ్గి 18.85 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.03 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.35 వద్ద ఉన్నాయి.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 7 శాతానికిపైగా పెరిగి 102.20 డాలర్లకు చేరింది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 92.73 వద్ద ఉంది.
