అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold on Wheels Vizag | ఆభరణాలు అంటే జ్యువెలరీ షోరూమ్‌లు గుర్తొచ్చే రోజుల్లో, ఒక వినూత్న ఆలోచనతో రోడ్డు మీదే బంగారం అమ్మకం ప్రారంభమవడం విశాఖలో చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం (Visakhapatnam) లోని బీచ్ రోడ్డుపై కనిపించిన ఈ ‘గోల్డ్ ఆన్ వీల్స్’ కాన్సెప్ట్ స్థానికులతో పాటు పర్యాటకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్‌మెరైన్ మ్యూజియం (Submarine Museum) ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బండి, అచ్చం ఐస్‌క్రీమ్ కార్ట్‌లా కనిపించేలా డిజైన్ చేశారు. ఈ బండిపైకి వచ్చే వారికి ఐస్‌క్రీమ్ ఇచ్చినట్లే బంగారు నాణేలు, చిన్న ఆభరణాలను అందించడం ఈ కాన్సెప్ట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Gold on Wheels Vizag | రూ.800కే బంగారు నాణెం
ఈ వినూత్న ప్రయత్నం వెనుక ఒక జ్యువెలరీ సంస్థ ఉందని నిర్వాహకులు తెలిపారు. పాతకాలంలో రోడ్లపైనే బంగారం అమ్మేవారనే భావనను ఆధునిక మార్కెటింగ్‌తో మిళితం చేసి ‘గోల్డ్ ఆన్ వీల్స్’ (Gold on Wheels)గా తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఈ బండిని చూసిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఇక్కడ కేవలం రూ.800కే బంగారు నాణెం అందుబాటులో ఉండటం విశేషం. అంతేకాకుండా, ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకపోవడంతో వినియోగదారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తక్కువ విలువ గల బంగారు వస్తువులను మాత్రమే బండిపై ఉంచినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఖరీదైన ఆభరణాలు మాత్రం షోరూమ్‌లలోనే అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Gold on Wheels Vizag | మళ్లీ ఇదే విధంగా బండి ఏర్పాటు
ఈ నెల 11, 12 తేదీల్లో ప్రారంభమైన ఈ ప్రయోగానికి మంచి స్పందన రావడంతో, మళ్లీ 18, 19, 20 తేదీల్లో కూడా ఇదే విధంగా బండి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుంచి ఈ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, రోడ్డు పక్కన బంగారం అమ్ముతున్న ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూ మరింత మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొత్త తరహా మార్కెటింగ్ పద్ధతులు వినియోగదారులను ఎలా ఆకట్టుకుంటాయో ఈ ‘గోల్డ్ ఆన్ వీల్స్’ మరోసారి రుజువు చేసింది.
View this post on Instagram
ఇది కూడా చదవండి..: Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
