అక్షరటుడే, వెబ్డెస్క్: RTC JAC Strike Talks | లేబర్ కమిషనర్ (Labour Commissioner)తో ఆర్టీసీ జేఏసీ నేతలు సోమవారం చర్చలు జరపనున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు (RTC Workers) కోరుతున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పీఆర్సీ ఏరియర్స్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే అప్పగించాలని కార్మికులు కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామని గతంలో హెచ్చరించారు. ఈ మేరకు మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇచ్చింది. సమ్మె నోటీసుపై చర్చలకు పిలవకపోవడంతో ఇటీవల జేఏసీ నేతలు అధికారులతో చర్చించారు. దీంతో తాజాగా చర్చలు జరగనున్నాయి.
RTC JAC Strike Talks | గతంలోనే పిలిచినా..
చర్చల కోసం గతంలో రెండు సార్లు అధికారులు జేఏసీ నేతలను (JAC Leaders) పిలిచారు. అయితే తర్వాత వాటిని వాయిదా వేశారు. మార్చి 25న తొలుత చర్చలు జరుపుతామని తెలిపారు. అనంతరం ఏప్రిల్ 9న కార్మిక నాయకులను ఆహ్వానించారు. అయితే అప్పుడు చర్చలు జరగలేదు. దీంతో సోమవారం కార్మిక నేతలలో లేబర్ కమిషనర్ చర్చలు జరపనున్నారు. పలు ప్రధాన డిమాండ్లను సాధించుకోవాలని కార్మికులు భావిస్తున్నారు.
RTC JAC Strike Talks | సమ్మెకు వెళ్తాం
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. నేడు చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని యోచిస్తున్న తెలిసింది. అయితే ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులపై ప్రభుత్వం స్పందించలేదు.
ఇది కూడా చదవండి..: Ameenpur HYDRAA demolitions | అమీన్పూర్లో ముగిసిన హైడ్రా కూల్చివేతలు.. 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్
