అక్షరటుడే, వెబ్‌డెస్క్: Constable Death | ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) యాలాల మండలంలో చోటు చేసుకుంది.
తాండూరులో భద్రేశ్వర స్వామి (Bhadreshwara Swami) జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర బందోబస్తు విధుల కోసం నర్సింలు వెళ్లారు. రాత్రి పూట విధులు ముగించుకొని తన స్వగ్రామానికి బయలు దేరాడు. బ్రిడ్జి నిర్మాణం ప్రాంతంలో ఉన్న నీటి గుంతలో ఆయన ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. చీకటిగా ఉండటంతో గుంతను గమనించలేక ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన యాలాల మండలం (Yalala Mandal) లక్ష్మీ నారాయణపూర్ సమీపంలో కల్వర్టు వద్ద చోటు చేసుకుంది.
Constable Death | యాలాల ఠాణాలో విధులు
నర్సింలు స్వగ్రామం బషీరాబాద్ మండలం (Bashirabad Mandal) రెడ్డిఘనపూర్ కాగా.. యాలాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భద్రప్ప జాతర బందోబస్తుకు వెళ్లిన ఆయన విగత జీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Heatwave Alert | మరింత పెరగనున్న ఎండలు.. వడగాలులతో జాగ్రత్త
