Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన.. నోయిడాలో ఉద్రిక్తత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన.. నోయిడాలో ఉద్రిక్తత

జాతీయం

Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన.. నోయిడాలో ఉద్రిక్తత

జీతాలు పెంచాలని కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడా సెక్టార్​ 2లో చోటు చేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 13, 2026 11:40 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 రోజులు ago
Share
Noida Workers Protest

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Noida Workers Protest | జీతాలు పెంచాలని కార్మికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కార్మికులు ఆఫీసు అద్దాలు ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడా సెక్టార్​ 2 (Noida Sector 2)లో చోటు చేసుకుంది.

Contents
  • Noida Workers Protest | కార్మికులకు హక్కులు దక్కాలి
    • Noida Workers Protest | సంయమనం పాటించాలి

నోయిడాలో ఫ్యాక్టరీ కార్మికులు (Factory Workers) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించగా.. ఆందోళనకారులు వాహనాలను ధ్వంసం చేస్తూ, రాళ్లు విసిరారు. అనేక ఫ్యాక్టరీలు ఉన్న నోయిడా ఫేజ్ 2లో నిరసన చేస్తున్న కార్మికులు ఒక పోలీస్ వ్యాన్‌ను, ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. జీతాల పెంపు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలతో సోమవారం ఉదయం నోయిడాలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ అయింది.

Noida Workers Protest | కార్మికులకు హక్కులు దక్కాలి

కార్మికులకు వారి హక్కులు దక్కాలని, పరిశ్రమలు కార్మిక చట్టాలను పాటించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) అన్నారు. కార్మికులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని రోజులుగా ఫ్యాక్టరీ కార్మికులు వేతన పెంపు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనాన్ని నెలకు రూ.11,274 నుంచి రూ.15,220కి పెంచుతున్నట్లు హర్యానా ప్రభుత్వం (Haryana Government) ప్రకటించిన తర్వాత ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. హర్యానాలో తమ సమకాలీకులకు అదే పనికి ఎక్కువ వేతనం లభిస్తోందని వాదిస్తూ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా కనీస వేతనాలను పెంచాలని నోయిడాలోని కార్మికులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.

Noida Workers Protest | సంయమనం పాటించాలి

నిరసన జరుగుతున్న ప్రదేశానికి ఉన్నతాధికారులను పంపినట్లు నోయిడా పోలీసులు తెలిపారు. తాము కార్మికులతో మాట్లాడుతున్నామని, సంయమనం పాటించాలని కోరారు. పరిస్థితిని అదుపులో ఉంచడానికి కనీస బలప్రయోగం చేస్తున్నామని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన జీతం, సురక్షితమైన పని వాతావరణం, ప్రాథమిక సౌకర్యాలు లభించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. స్థానిక అధికారులు, పారిశ్రామిక యూనిట్లతో చర్చలు జరపాలని రాష్ట్ర కార్మిక శాఖను సీఎం ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Vijay Campaign Incident | అభిమానుల పూలవర్షం.. పారిపోయిన టీవీకే చీఫ్​ విజయ్​

ITR Forms | ఐటీఆర్​ ఫారాలను నోటిఫై చేసిన కేంద్రం
Vande Bharat Food Issue | వందే భారత్ రైలు భోజనంలో పురుగు
Nishant Kumar JDU | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమారుడు ఎంట్రీ.. జేడీయూలో చేరిన నిశాంత్ కుమార్..
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
TAGGED:Factory WorkersHaryana GovernmentNoida Sector 2Noida Workers ProtestUP CM Yogi Adityanath
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jananayagan HD Leak Jananayagan HD Leak | విడుదలకు ముందే ‘జననాయగన్’ హెచ్‌డీ లీక్.. లీకు వీరుల‌ని అరెస్ట్ చేసిన పోలీసులు
Next Article Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట! Ideal Woman | ఈ గుణాలు ఉన్న స్త్రీ.. ఇంటికి లక్ష్మీదేవితో సమానమట!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?