Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

తాజా వార్తలుఅంతర్జాతీయం

Travel Advisory | ఇరాన్‌లో ఉండొద్దు.. భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ

యూఎస్, ఇరాన్‌ల మధ్య చర్చలలో పురోగతి లేకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 3:57 సా.
admin
1 నెల ago
Share
Travel Advisory

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Travel Advisory | యూఎస్, ఇరాన్‌ల మధ్య చర్చలలో పురోగతి లేకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్‌పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్‌లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలంటూ తాజాగా అడ్వైజరీని జారీ చేసింది.

Contents
  • Travel Advisory | దాడి సంకేతాల నేపథ్యంలో..
    • Travel Advisory | అప్రమత్తంగా ఉండాలి

Travel Advisory | దాడి సంకేతాల నేపథ్యంలో..

ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు విడతలుగా జరిగిన అణు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్, ఆయతుల్లా అలీ ఖమేనీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమాసియా మరింత వేడెక్కింది. అణు చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడికి వెనుకాడబోమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అగ్రరాజ్యం తన యుద్ధ నౌకలు, విమానాలను మధ్యప్రాచ్యానికి తరలించి మోహరించింది. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ అధినేత ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. జెనీవాలో చర్చలు మూడు గంటల్లోనే ముగిసిన తర్వాత.. ఇరాన్ హర్మూజ్ జల సంధిని తాత్కాలికంగా మూసివేసి, క్షిపణి విన్యాసాలు నిర్వహించింది. ఇలా ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలోనే టెహ్రాన్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు నిరసనలు చేపట్టారు.

Travel Advisory | అప్రమత్తంగా ఉండాలి

ఇరాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌లో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం తొలి అడ్వైజరీని జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించింది. దానికి కొనసాగింపుగా గతనెల 14న మరో అడ్వైజరీని వెలువరించింది. తాజాగా మరో అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు (విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు) అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా తక్షణమే ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. భారతీయులు, భారత సంతతికి చెందినవారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని అడ్వైజరీలో పేర్కొంది.

ఇది కూడా చదవండి..: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్‌.. రేపటి నుంచి ట్రంప్‌ టారిఫ్‌లు నిలిపివేత

TVS Orbiter V1 | రూ.49,999 లకే టీవీఎస్ ఈవీ స్కూటర్.. ఆర్బిటర్ వీ1 ను లాంచ్ చేసిన కంపెనీ
Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Rythu Bharosa Issue | ఎన్ని ఎకరాల భూమి ఉన్నా.. ఒక్క ఎకరాకే రైతు భరోసా జమ
Rahul Gandhi on Modi | ట్రంప్​కు భయపడుతున్న మోదీ : రాహుల్​ గాంధీ
KTR ACB Chargesheet | ఏసీబీ ఛార్జిషీటుపై స్పందించిన కేటీఆర్​
TAGGED:Ayatollah Ali KhameneiDonald TrumpGeneva TalksHormuz StraitIndia Advisory IranIndian Embassy TehranIran Travel AdvisoryIran US TensionsMiddle East CrisisOman Mediation
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్​! Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Next Article IDFC Bank Fraud IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?