అక్షరటుడే, వెబ్డెస్క్: Hair Wash Frequency | సిల్కీ హెయిర్ అయినా, ఉంగరాల జుట్టైనా.. ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్లయినా తలస్నానం చేసే విషయంలో ఒకే పద్ధతి అనుసరిస్తుంటారు. కొంతమంది రెండు, మూడు రోజులకోసారి హెడ్ బాత్ చేస్తుంటారు. ఇక మరికొందరేమో వారానికోసారి తలస్నానం ఆచరిస్తారు. కానీ, జుట్టును బట్టి తలస్నానం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. దీనివల్ల జుట్టు రాలిపోవడం, పొడిబారడం, కుదుళ్లు బలహీనపడడం లాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
Hair Wash Frequency | సెమీ కర్లీ హెయిర్..
ఈ హెయిర్ ఉన్న వాళ్లు వారంలో రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ జుట్టు ఒత్తుగా ఉంటే వారానికి రెండుసార్లు చేయవచ్చంటున్నారు. నూనె ఆధారిత షాంపూలను ఎంచుకోకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు. వీటివల్ల జుట్టు సహజమైన కర్లీనెస్‌ని కోల్పోయే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.
Hair Wash Frequency | కర్లీ హెయిర్..
కర్లీ హెయిర్ అలల్లా ఎగురుతూ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే, ఉంగరాల జుట్టు త్వరగా పొడిబారిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే హెడ్ బాత్ చేయాలని సూచిస్తున్నారు. జుట్టును తేమను కోల్పోకుండా ఉండాలంటే తలస్నానం చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
పొడి జుట్టా..
పొడిబారిన జుట్టు ఉన్న వాళ్లు తమ కురులకు రంగు వేసుకున్నా.. హెయిర్ డ్రయర్స్ వాడినా జుట్టు గడ్డిలా మారడం, అలర్జీలు రావడం లాంటి సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా జుట్టు నిర్జీవమైపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే సహజసిద్ధమైన షాంపూలను ఎంచుకోవాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..: iQOO 15R Launch | ఐకూనుంచి మిడ్‌రేంజ్‌లో పవర్‌ఫుల్ ఫోన్..! ప్రీ బుకింగ్‌తో ఐకూ టీడబ్ల్యూఎస్ ఫ్రీ..

